పీచెస్ రక్తపోటును, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలో హిస్టమైన్ ఉత్పత్తిని నిరోధించి, అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది. అంతేకాదు.. పీచ్ పండుతో అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. పండులో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండటం వల్ల ఈ పండుతో ఫేషియల్ చేయడం వల్ల చర్మం ముడతలు తొలగిపోయి, చర్మ రంధ్రాలలోని మలినాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా, మెరుస్తూ ఉంటుంది.
