
Punjab Kings vs Rajasthan Royals, 18th Match: ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా 18వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) పంజాబ్ కింగ్స్ (PBKS)ను 50 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో రాజస్థాన్ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించగా, పంజాబ్ ఈ సీజన్లో తొలిసారి ఓడిపోయింది.
శనివారం ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేహాల్ వధేరా 41 బంతుల్లో 62 పరుగులు చేశాడు. గ్లెన్ మాక్స్వెల్ (30 పరుగులు) తో కలిసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ, జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మ, మహేష్ తీక్షణా చెరో 2 వికెట్లు పడగొట్టారు.
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 45 బంతుల్లో 67 పరుగులు, రియాన్ పరాగ్ 25 బంతుల్లో 43 నాటౌట్, కెప్టెన్ సంజు శాంసన్ 26 బంతుల్లో 38 పరుగులు సాధించారు.
ఇవి కూడా చదవండి
రెండు జట్ల ప్లేయింగ్ XI..
పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, సూర్యాంశ్ షెడ్జ్, గ్లెన్ మాక్స్వెల్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంపాక్ట్ ప్లేయర్: ప్రియాంష్ ఆర్య.
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహిష్ తీక్షణ, యుధ్వీర్ సింగ్, సందీప్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్ : కుమార్ కార్తికేయ.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..