

నిర్మాతలు ఎంత గట్టిగా చెబుతున్నా పవన్ కల్యాణ్ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో క్లారిటీ మాత్రం రావటం లేదు. నిన్న మొన్నటి వరకు హరి హర వీరమల్లు ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రావటం పక్కా అన్న ప్రచారం జరిగింది. వాయిదా పడుతుందన్న వార్తలు పీక్స్ లో ట్రెండ్ అయినా… యూనిట్ మాత్రం మార్చి 28న రిలీజ్ అన్న డేట్ తోనే అప్ డేట్స్ ఇస్తూ వచ్చింది. కానీ సడన్ మే 9కి వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించి ఆడియన్స్ కు షాక్ ఇచ్చింది.
దీంతో మే 9కి అయినా హరి హర వీరమల్లు వచ్చే ఛాన్స్ ఉందా అన్న డౌట్స్ మళ్లీ రెయిజ్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ సిద్ధం చేసింది యూనిట్. దాదాపు పది రోజులు షూటింగ్ పెండింగ్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అది కూడా క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కావటంతో పోస్ట్ ప్రొడక్షన్ కి కూడా చాలా టైమ్ కావాలి. పీరియాడిక్ యాక్షన్ డ్రామా క్లైమాక్స్ అంటే భారీ గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉంటుంది. అసలు పవన్ డేట్స్ ఎప్పుడిస్తారన్న విషయం తేలితేనే మిగతా విషయాల మీద ఓ క్లారిటీ వస్తుంది.
ఇంకా హరి హర వీరమల్లు విషయంలోనూ ఎలాంటి క్లారిటీ రాకపోయినా… ఓజీ రిలీజ్ డేట్ కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్నది లేటెస్ట్ అప్డేట్. చిత్రయూనిట్ అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేయకపోయినా.. రిలీజ్ డేట్ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సెప్టెంబర్ నాటికి ఓజీ సిద్ధం అవ్వటం అంటే మామూలు విషయం కాదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. హరి హర వీరమల్లు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ పూర్తి చేయటానికే చాలా టైమ్ పడుతుంది. ఆ తరువాత మళ్లీ ఓజీ డేట్స్ అడ్జస్ట్ చేసిన షూటింగ్ ఫినిష్ చేసేందుకు ఫ్రీగా పవన్ ఉంటారా..? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్. అయితే అభిమానులు మాత్రం ఓజీ ఎంట్రీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లారు దర్శకుడు సుజిత్.
ఓజీలో పవన్ లుక్స్ యాక్షన్ బ్లాక్స్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఈ సినిమా సక్సెస్ తరువాత పవన్ రిటైర్మెంట్ ప్రకటించి పాలిటిక్స్‌కి డెడికేట్ అయినా పర్లేదని ఫీల్ అవుతున్నారు. మరి అభిమానుల రిక్వెస్ట్‌ను పవన్ కన్సిడర్ చేస్తారేమో చూడాలి.