తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆపన్న హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవర్ స్టార్ రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం (జులై 01) మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ , పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు ఈ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని నటితెలిపారు.
ఇవి కూడా చదవండి
నటి పాకీజాకు ఆర్థిక సాయం అందజేస్తోన్నజనసేన నేతలు..
సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం. pic.twitter.com/YD2YYw1mO7
— JanaSena Party (@JanaSenaParty) July 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
