
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ తెలుగు వెండి తెరపై అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో అడుగు పెట్టాడు. మొదటి సినిమాలోనే రియల్ స్టంట్స్ చేసి యుత్ కి దగ్గర అయ్యారు పవన్. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా పవన్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందరికీ అబిమానులు ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కు భక్తులు ఉంటారు.. ఆయన్ని నడిచే దైవంగా భావిస్తారు. ప్రేమిస్తారు. అందుకనే పవన్ కళ్యాణ్ మొదటి సినిమా రిలీజ్ అయిన సినిమా తేదీని పవనిజం డేగా జరుపుకుంటారు. అన్న చాటు తమ్ముడిగా 1996లో వెండి తెరపై అడుగు పెట్టినా.. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా తనదైన శైలిలో సినిమాలను చేస్తూ స్టార్ హీరోల్లో ఒకరుగా ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. కొంత మంది సెలబ్రిటీ సైతం మేము పవన్ కళ్యాణ్ కి అభిమానులం అని చెప్పుకునే స్టేజ్ కి చేరుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాకు పాన్ ఇండిగా స్టార్ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో ఉన్నాడు.
రాజకీయాల్లో అడుగు పెట్టి.. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజిబిజిగా ఉన్న పవన్ కళ్యాణ్ నేటికీ టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరని చెప్పవచ్చు. ఇప్పుడు పవన్ సై అంటే చాలు సినిమా చేయడానికి, పారితోషికంగా కోట్లు చెల్లించడానికి నిర్మాతలు రెడీ. అయితే పవన్ కళ్యాణ్ , సుప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకు నిర్మాతైన అల్లు అరవింద్ .. పవన్ కళ్యాణ్ కు పారితోషకంగా ఎంత ఇచ్చారో తెలుసా..
పవన్ కళ్యాణ్ , సుప్రియ ప్రధాన పాత్రలో నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో 1996లో టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాకు డైరెక్టర్ ఇవీవీ సత్యనారాయణ. అంతేకాదు హిందీ హిట్ మూవీ ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ని తెలుగులో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రీమేక్ చేశారు. రిలీజైన తర్వాత మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే పవన్ ఈ సినిమాలో చేసిన రియల్ స్టంట్స్ తో యువతని ఆకట్టుకున్నారు. ఇప్పుడు రోజుకి కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్టేజ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అరవింద్ తనకు సినిమాలో నటించినందుకు నెలకు జీతాన్ని ఇచ్చారని చెప్పారు. ఈ చిత్రానికి గాను కొన్ని నెలలు నెల పాటు నెలకు రూ. 5,000 పారితోషికం అందుకున్నానని చెప్పారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..