
హిందూ మతంలో ఏకాదశి ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల విష్ణువు, లక్ష్మీదేవిల ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం. ప్రతి నెలా రెండుసార్లు ఏకాదశి తిధి వస్తుంది. దీంతో మాసంలో రెండు సార్లు ఉపవాసం ఉంటారు. ఒకటి మరొకటి శుక్ల పక్షంలో మరొకటి కృష్ణ పక్షంలో. సాధారణంగా సంవత్సరంలో 24 ఏకాదశిలు ఉంటాయి అయితే అధిక మాసం వస్తే అప్పుడు ఏడాదిలో ఏకాదశుల సంఖ్య 26 అవుతుంది. ఈ ఏడాదిలో చివరి ఏకాదశి పాపమోచని ఏకాదశి. దీనిని దక్షిణ భారత దేశంలో హిందూ క్యాలెండర్ ను అమావాస్య నుంచి అమావాస్యకు మధ్య ఉన్న సమయాన్ని మాసంగా పరిగనిస్తారు.. దీని ప్రకారం.. పామోచని ఏకాదశి ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షంలో వస్తుంది.. ఉత్తర భారత క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని కృష్ణ పక్షంలో జరుపుకుంటారు.
పాపమోచని ఏకాదశి అంటే పాపాలను నాశనం చేస్తుందని.. తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి , అపరాధ కర్మల నుంచి విముక్తిని కలిగిస్తుందని నమ్ముతారు. ఈ ఏకాదశిని పూర్తి భక్తితో ఆచరించడం ద్వారా, వ్యక్తికి భూత, ప్రేత ప్రేరేపిత ప్రభావం ఉండదు. వైష్ణవాలయలను సందర్శించడం ద్వారా వెయ్యి ఆవులను దానం చేసినంత ఫలితం ఉంటుంది. ఈ సంవత్సరం పాపమోచని ఏకాదశి ఉపవాసం మార్చి 25, 2025న పాటించబడుతుంది. ఈ రోజు పాపమోచని ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..
2025 పాపమోచని ఏకాదశి ఎప్పుడు?
పాల్గుణ మాసం కృష్ణ పక్ష ఏకాదశి తిథి మార్చి 25న ఉదయం 5:05 గంటలకు వస్తుంది. ఈ ఏకాదశి తిథి మార్చి 26న తెల్లవారుజామున 3:45 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయతిథి ప్రకారం, పాపమోచని ఏకాదశి ఉపవాసం మార్చి 25, 2025న చేయాల్సి ఉంటుంది.
పాపమోచని ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి?
పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి.. పాపాల నుంచి విముక్తి పొందడానికి పాపమోచని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. పాపమోచని ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని.. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శుభ సమయంలో పూజ చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.
సిరి సంపదలకు నెలవు
పాపమోచని పేరులో ఉంది.. పాపల నుంచి విముక్తినిచ్చేది అని. పాపమోచని ఏకాదశి ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తి తెలిసి తెలియక చేసిన సకల పాపాలు నశిస్తాయి. పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటంతో పాటు, లక్ష్మీనారాయణులను కూడా నిర్మల హృదయంతో పూజించాలి. దీనితో పాటు పాపమోచని ఏకాదశి ఉపవాస కథను కూడా చదవాలి లేదా వినాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం.
సకల పాపాల నుంచి విముక్తి
పాపమోచని ఏకాదశి భక్తుడిని పాపాల నుండి విముక్తి చేసి అతనికి మోక్ష మార్గాన్ని తెరుస్తుంది. ఈ రోజు ఉపవాసం ఆచరించడం వలన జన్మజన్మల పాపాలు నశిస్తాయి. దీనితో పాటు పాపమోచని ఏకాదశి ఉపవాసం చేసి.. తీర్థయాత్రలను సందర్శించడం వలన వెయ్యి గోవులను దానం చేయడం వలన వచ్చే పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం పొందుతాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు
ఇవి కూడా చదవండి