

గతంలో ఇంట్లోనే అప్పడాలు తయారు చేసుకునేవారు. కానీ ప్రస్తుతం అందరూ దుకాణాల నుంచి అప్పడాలు కొనుగోలు చేస్తున్నారు. గతంలో అప్పడాలు ప్రతి ఇంట్లో ప్రధాన ఆహారంగా ఉండేది. అది కూడా ఇంట్లో తయారుచేసిన అప్పడాలు కావడంతో ప్రతి రోజూ భోజనంలో తీసుకునేవారు. కానీ నేటికాలంలో ఆ పద్ధతి లేదు. కొందరు వ్యాపారులు అపరిశుభ్రంగా వీటిని తయారు చేయడం వల్ల వినియోగించేవారు రోగాల బారీన పడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బియ్యం నుంచి గుమ్మడి వరకు రకరకాల అప్పడాలు తయారు చేస్తుంటారు. వీటిని తినడం వల్ల కేలరీలు తక్కువగా అందుతాయనే మనం అనుకుంటాం.
మీకు తెలుసా.. అరచేయంత అప్పడంలో దాదాపు 13 గ్రాముల పోషకాలు ఉంటాయి. ఇందులో 35-40 గ్రాముల కేలరీలు, 0.42 గ్రాముల కొవ్వు ఉంటుంది. అలాగే 3.3 గ్రాముల పోషకాలు ఉంటాయి. ఇందులో 7.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 226 మి.గ్రా. సోడియం ఉంటుంది. అందుకే వీటిని వారానికోసారి లేదా అరుదుగా తినడం ఉత్తమం. రెండు అరచేతులు చపాతీకి సమానమైన కేలరీలను అప్పడాల్లో ఉంటాయి.
అప్పడాలు అధికంగా తినడం వల్ల కలిగే 3 ఆరోగ్య ప్రమాదాలు ఇవే
అధిక సోడియం కంటెంట్
అప్పడాల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. అధిక మొత్తంలో ఉప్పు, సోడియం ఆధారిత పదార్ధాలు ఇందులో ఉంటాయి. అధిక సోడియం తీసుకోవడం అధిక రక్తపోటు, మూత్రపిండాల రుగ్మతలు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అధిక సోడియం స్థాయిలు కలిగిన ప్రాసెస్ చేసిన ఆహారాలు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి.
వేయించిన అప్పడాలు ప్రమాదం
అప్పడాల వల్ల యాక్రిలామైడ్ ప్రమాదం ఉంది. పాపడ్ వంటి కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాన్ని వేయించడం వల్ల అక్రిలామైడ్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
కృత్రిమ రుచి
అప్పడాలు ప్యాక్ చేసి మార్కెట్లకు అందిస్తారు. దాని రుచిని కాపాడటానికి వారు కృత్రిమ రుచులు, సంరక్షణకారులను జోడిస్తారు. దీనివల్ల జీర్ణ సమస్యలు, ఆమ్లత్వం పెరుగుతాయి. అంతేకాకుండా అధిక ఉప్పు, సోడియం లవణాలు తరచుగా రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు.
భోజనంలో రుచిని పెంచడానికి బయట హోటల్లలో కూడా అప్పడాలు వడ్డిస్తారు. కాబట్టి, భోజనం రుచిగా ఉందని ఎక్కువగా తినకండి. దీన్ని మితంగా తీసుకోవాలి. మార్కెట్లలో లేదా దుకాణాలలో అమ్మే వాటిని ఉపయోగించే బదులు, వాటిని ఇంట్లో తయారు చేసుకోవడం ఆరోగ్యకరం.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.