
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో పంజా ఒకటి. డైరెక్టర్ విష్ణువర్దన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2011లో విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇందులో పవన్ లుక్, స్టైల్, మ్యానరిజం అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో దూసుకుపోతుంటారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన సారా జేన్ డయాస్ కథానాయికగా నటించింది. అలాగే ఆమెతోపాటు అంజలి లావానియా అనే మరో అమ్మాయి సైతం కథానాయికగా కనిపించింది. ఈ మూవీతో ఒక్కసారిగా తెలుగులో పాపులర్ అయ్యింది అంజలి.
పంజా సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఒక్కసారిగా ఫాలోయింగ్ పెంచుకుంది. ఇందులో గ్లామర్ లుక్ లో కుర్రకారుకు మెంటలెక్కించింది. దీంతో తెలుగులో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ అలా కాకుండా అనుహ్యంగా సినిమాలకు దూరమైంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఇన్ స్టా ఫోటోస్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తెలుగులో పంజా సినిమాలో మాత్రమే కనిపించిన అంజలి.. ఆ తర్వాత 2012లో వోగ్ టాప్ 10 మోడల్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది. అలాగే పలు అందాల పోటీల్లో పాల్గొంది.
అయితే అంజలి సినిమాలకు దూరం కావడానికి సరైన రీజన్ కూడా ఉందట. చక్ర హీలింగ్, క్రియా యోగా వంటి వైద్యం చేసే కళలను నేర్చుకోవడానికే ఈ బ్యూటీ సినిమాలకు బ్రేక్ తీసుకుందట. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ.. నెట్టింట మాత్రం చాలా యాక్టివ్. ప్రస్తుతం ఈ అమ్మడు డీజేగా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..