ఇండియాలో నివసించే ప్రతీఒక్కరికీ ఆధార్ కార్డుతో పాటు అవరమైన మరో డాక్యుమెంట్ పాన్ కార్డు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు శాలరీ పొందాలన్నా పాన్ కార్డు అవసరం. ఇక రూ.50 వేలకు మించి చేసే బ్యాంక్ లావాదేవీలకు కూడా ఇది తప్పనిసరి. ఇలా పాన్ కార్డ్ లేకపోతే ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాలు, లావాదేవీలు నిర్వహించలేరు. అలాగే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలన్నా ఈ ధృవీకరణ పత్రం అవసరమే. అలాగే ఇతర సేవలు పొందేందుకు ఒక ప్రభుత్వ ధృవీకరణ డాక్యుమెంట్‌గా కూడా పాన్ కార్డు పనిచేస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్, రుణాలు, స్టాక్ మార్కెట్ షేర్ల కొనుగోలు, లైఫ్ ఇన్యూరెన్స్ ప్రీమియం వంటి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
కార్డు పోతే ఏం చేయాలి..?
ఒకవేళ మీ పాన్ కార్డు పోయినా లేదా దొంగలించబడినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. దీని వల్ల మీ కార్డ్ దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు. అలాగే ఆన్ లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో డూప్లికేట్ పాన్ కార్డు సెకన్లలోనే పొందవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.
ఆన్లైన్ ద్వారా ఇలా..
-NSDL అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
-డూప్లికేట్ పాన్ కార్డు అనే బటన్‌ను క్లిక్ చేయండి
-పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయండి
-అనంతరం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఓటీపీ సబ్మిట్ చేయాలి
-అడ్రస్, పిన్ కోడ్ వివరాలను వెరిఫై చేసుకోవిాలి
-పాన్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి
-ఆన్లైన్లో రూ.50 ఫీజు చెల్లించాలి
-ఆ తర్వాత అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చజ
ఆఫ్‌లైన్ ద్వారా..
ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ నుంచి డూప్లికేట్ అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి. దగ్గల్లోని ఎన్ఎస్డీఎల్ ఫెసిలిటేషన్ సెంటర్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్రస్, మొబైల్ నెంబర్, పాన్ కార్డు నెంబర్, ఆధార్ వంటి వివరాలు సమర్పించండి.
