
జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఎంతో మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ దాడి ఘటనతో దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి అందాల మధ్య ఎల్లప్పుడూ సందడిగా ఉండే ఈ సుందరమైన ప్రాంతం ఇప్పుడు భీకర ఉగ్రదాడితో ఊహించని విధంగా మారింది. ఈ ఘటనపై సినీప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అలాగే పహల్గాం ప్రదేశంతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్గాం ప్రాంతంలో ఎన్నో సినిమా షూటింగ్స్ జరిగాయి. ఆ అందమైన ప్రకృతి మధ్య బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించారు. అందమైన కశ్మీర్ లోయలలో షూటింగ్స్ జరిగిన సినిమాలేంటో తెలుసుకుందామా.
1. 2009లో విడుదలైన ‘3 ఇడియట్స్’ సూపర్ హిట్ చిత్రం. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని కాశ్మీర్లో చిత్రీకరించారు.
2. ఇక షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ జంటగా నటించిన ‘జబ్ తక్ హై జాన్’ చిత్రం 2012లో విడుదలైంది. ఈ చిత్రాన్ని సైతం కశ్మీర్ లోయలో తెరకెక్కించారు.
3. హిందీలో సూపర్ హిట్ అయిన ‘యే జవానీ హై దీవానీ’ చిత్రం సైతం పహల్గాం, గుల్ మార్గ్, శ్రీనగర్ ప్రాంతాలలో షూటింగ్ నిర్వహించారు. 2013లో ఈ మూవీ విడుదలైంది. ఇందులో రణబీర్ కపూర్, దీపికా పదుకొనే, కల్కి కోచ్లిన్, ఆదిత్య రాయ్ కపూర్ నటించారు.
4. 2014లో విడుదలైన ‘హైదర్’ సినిమా ఎక్కువ భాగం కాశ్మీర్లో షూటింగ్ జరిగింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ఈ సినిమాలో షాహిద్ కపూర్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు.
5. అలాగే హైవే సినిమా. 2014లో విడుదలైన ఈ మూవీ షూటింగ్ కశ్మీర్ లోని ఆరు లోయలో జరిగింది. ఇందులో రణదీప్ హుడా, అలియా భట్ ప్రధాన పాత్రలలో నటించారు.
6. ‘బజరంగీ భాయిజాన్’ సినిమాలో కాశ్మీర్ అందాలను అద్భుతంగా చిత్రీకరించారు. 2015లో విడుదలైన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ నటించారు.
7. 2016లో విడుదలైన ‘ఫితూర్’ సినిమా షూటింగ్ మొత్తం కాశ్మీర్లోనే జరిగింది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, కత్రినా కైఫ్, టబు కీలకపాత్రలు నటించారు.
8. అలియా భట్ నటించిన ‘రాజీ’ చిత్రం 2018లో విడుదలైంది. ఈ చిత్రం ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. ఆలియా భర్తగా విక్కీ కౌశల్ నటించాడు.
9. అలాగే తెలుగులో అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సైతం పహల్గాంలోనే షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
10. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమా షూటింగ్ సైతం అక్కడే జరిగింది. ఈ ప్రాంతంలోనే ఓ సాంగ్ సైతం షూటింగ్ చేశారు.
11. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషీ సినిమా షూటింగ్ సైతం పహల్గాం ప్రాంతంలోనే జరిగింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..