
పహల్గామ్ ఉగ్రదాడిపై అస్సాం AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. ఎమ్మెల్యే వివాదాస్పద ప్రకటన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఏప్రిల్ 24గురువారం రోజున పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు చనిపోయి, యావత్ దేశం తీవ్ర దు:ఖంలో ఉండగా, మరికొందరు మాత్రం ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, అస్సాంకు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం అత్యవసర అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో కేంద్ర హోం మంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కూడా హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..