
పహల్గామ్ ఉగ్రదాడికి దీటైన కౌంటర్‌కు కేంద్రం రెడీ అయ్యింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన నేడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిలపక్షం సమావేశం కానుంది. సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ జరగనుండగా.. ఉగ్రదాడి మృతులపై కేంద్రం ఇప్పటికే అధికారిక ప్రకటన చేసింది. 25మంది భారతీయులు, ఒక నేపాలీ మృతిచెందినట్టు పేర్కొంది. ఇదిలా ఉంటే.. అఖిలపక్ష సమావేశాని కంటే ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశంకానుంది. ఉదయం 11 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశమై పహల్గామ్ ఉగ్రదాడిపై చర్చింనుంది. మరోవైపు ఉగ్రదాడి నేపథ్యంలో మధ్యాహాన్నం 3 గంటలకు కశ్మీర్లో కూడా నేడు అఖిలపక్ష భేటీ కానుంది. అఖిలపక్ష సమావేశానికి CM ఒమర్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. ఉగ్రదాడిపై శ్రీనగర్, పహల్గామ్లో NIA అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది.
అటు భారత్-పాక్ సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. నేడు పాక్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం కానుంది. ఈ సమవేశానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షత వహించనున్నారు. ఏ సమయంలోనైనా భారత్ కౌంటర్ ఎటాక్ చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ భయపడుతోంది. ఇప్పటికే బోర్డర్లో ఆర్మీని, ఎయిర్‌ఫోర్స్‌ను అలెర్ట్ చేసింది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడిని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. కశ్మీర్, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు రంగం సిద్ధం అవుతోంది.