
జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో అనేక మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 27 మంది వరకు మరణించగా.. ఎంతో మంది జీవితాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఉగ్రదాడి ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇప్పుడు ఈ ఉగ్రదాడి ఎఫెక్ట్ ఇండస్ట్రీలోని రెండు సినిమాలపై ప్రధానంగా పడుతుంది. ఒకటి ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం కగా.. మరొకటి పాకిస్తాన్ నటుడు ఫహద్ ఖాన్ నటించిన అబిర్ గులాల్. పాకిస్తానీ నటులను నిషేధించాలని సమాజంలోని అనేక వర్గాల నుండి డిమాండ్ వస్తోంది.
ఇమాన్వీని వెంటనే ‘ఫౌజీ’ చిత్రం నుండి తొలగించాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇమాన్వీ కరాచీలో పుట్టారు. ఆమె తండ్రి ఇక్బాల్ ఒకప్పుడు పాకిస్థాన్ మిలటరీలో ఉన్నత అధికారిగా పని చేసిన విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తూ ఇమాన్వీని ‘ఫౌజీ’ చిత్రం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు బాలీవుడ్ హీరో ఫవాద్ ఖాన్‌ను వదిలిపెట్టడం లేదు నెటిజన్లు.. రీసెంట్గా ఫవాద్ నటించిన అబిర్ గులాల్ మూవీ ఆపాలంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. అబిర్ గులాల్ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకుంటామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన హెచ్చరించింది. మరోవైపు ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ ఎక్స్‌లో హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
అబిర్ గులాల్ సినిమాలో పాకిస్తానీ నటుడు ఫహద్ ఖాన్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ నటించింది. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ సినిమా వివాదంలో చిక్కుతుంది. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయలంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) ఈ చిత్రాన్ని రాష్ట్రంలో ప్రదర్శించడాన్ని గతంలో వ్యతిరేకించింది. పాకిస్తానీ నటుడు నటించిన ఏ ప్రాజెక్టును విడుదల చేయనివ్వబోమని హెచ్చరించింది. కపూర్ & సన్స్, ఏ దిల్ హై ముష్కిల్ చిత్రాల ద్వారా భారతదేశంలో అపారమైన ప్రజాదరణ పొందిన ఫవాద్ ఖాన్ కెరీర్ ఇప్పుడు చిక్కుల్లో పడింది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..