
ఉగ్రదాడితో.. జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్, వాయుసేన బలగాలు కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి. పహల్గామ్ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది.. ఆర్మీ, డ్రోన్ల సాయంతో భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. NIA సైతం పహల్గామ్లో దర్యాప్తు మొదలుపెట్టింది.. ఉగ్రదాడి వెనుక లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి.. ఉన్నట్లు పేర్కొంటున్నారు. కశ్మీర్లో మరో ఉగ్రదాడి జరగొచ్చన్న నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో.. సున్నిత ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. కాగా.. పహల్గామ్ టెర్రర్ ఎటాక్‌కి నిరసనగా అన్ని పార్టీలు ఇవాళ జమ్ముకశ్మీర్ బంద్ కు పిలుపునిచ్చాయి.. ఈ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 28కి పెరిగింది.. 20మందికి పైగా గాయాపడ్డారు. 4 ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు మృతదేహాలను తరలించనున్నారు.
కాగా.. పహల్గామ్ లో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాది మొదటి చిత్రాన్ని పోలీసులు పంచుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో మంగళవారం పర్యాటకులపై దాడి చేసిన వారిలో ఈ ఉగ్రవాది పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఒకరు.. అతను ఆయుధాలు పట్టుకుని పఠానీ సూట్ ధరించి కనిపించాడు. ఈ ఫోటోను నిన్న రాత్రి 1 నుండి 2 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF, సైన్యంతో పంచుకున్నారు. ఈ నిర్మాణం మరియు రూపానికి సరిపోయే ఏవైనా అనుమానితులు ఉంటే నిశితంగా పరిశీలించి దర్యాప్తు చేయాలని, తదనుగుణంగా సంబంధిత నిఘాను సేకరించాలని అధికారులకు సూచించారు.
ట్రెక్కింగ్ యాత్ర కోసం సుందరమైన బైసరన్ లోయను సందర్శిస్తున్న పర్యాటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని అధికారులు నిర్ధారించారు.
కాగా.. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు పేర్కొంటున్నారు. దాడికి ఆరుగురు ఉగ్రవాదులు పాల్పడినట్లు పేర్కొంటున్నారు. స్థానికులతో కలిసి మూడువారాల ముందే రెక్కీ.. నిర్వహించారని.. ఉగ్రవాదుల్లో ఇద్దరు కశ్మీరీలు.. నలుగురు పాకిస్తానీయులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. టెర్రరిస్టులకు TRF ఉగ్రసంస్థతో లింకులు ఉన్నాయని.. వారి దగ్గర AK-47 వంటి ఆయుధాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..