
భూలోక స్వర్గమైన కశ్మీర్ ఇప్పుడు నరకంగా మారిపోయింది. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పహల్గామ్కు వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్ర దాడిని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ దారుణమైన ఉగ్రవాద చర్యను ఖండించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా, దీనికి స్థానికుల మద్దతు ఉందని సంచలన ఆరోపణలు చేశాడు. ‘ ఈ ఉగ్రవాదులు ఎందుకు హిందువులపైనే దాడులు చేస్తున్నారు కాశ్మీరీ పండితులు లేదా భారతదేశం నలుమూలల నుంచి వచ్చే హిందూ పర్యాటకులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? స్థానిక ఉగ్రవాదుల సహాయం లేకుండా ఇటువంటి దాడులు జరగవు’అని ట్వీట్ లో రాసుకొచ్చాడు కనేరియా. అలాగే పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ కూడా పహల్గామ్ ఉగ్ర దాడిని ఖండించాడు. ‘ ఈ ఉగ్రదాడితో నా హృదయం ముక్కలైంది’ అని ట్వీట్ చేశాడు హఫీజ్.
మంగళవారం (ఏప్రిల్ 22) పహల్గామ్లో పర్యాటకులపై కొంతమంది ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ సమయంలో, పర్యాటకులను వారి మతం గురించి అడిగి, వారు హిందువులని తెలుసుకున్న తర్వాత ఉగ్రవాదులు వారిని కాల్చి చంపారని తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది కాశ్మీర్‌కు విహారయాత్రకు వచ్చిన వారే. ఈ సంఘటన తో భారతీయుల్లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లు వెత్తుతున్నాయి. ఉగ్రవాదులతో పాటు కాశ్మీర్లో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్‌కు కూడా గుణపాఠం చెప్పాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
డానిష్ కనేరియా ట్వీట్..
Why is it that they never target local Kashmiris, but consistently attack Hindus — be it Kashmiri Pandits or Hindu tourists from across India? Because terrorism, no matter how it’s disguised, follows one ideology — and the whole world is paying the price for it. #Pahalgam
— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025
మతం పేరుతో అమాయకులను బలి తీసుకుంటారా?
Just read about the horrific and shocking terrorist attack in Pahalgam.
To target and kill innocent civilians in the name of religion is pure evil…
No cause, no belief, no ideology can ever justify such a monstrous act.Yeh kaisi ladai hai… pic.twitter.com/nP5LKpT94E— Mohammed Siraj (@mdsirajofficial) April 23, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…