
పహల్గామ్ మృతుల కుటుంబాలకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కొక్క కుటుంబానికి రూ.10లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది. ఉగ్రదాడుల్లో గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున సాయం ప్రకటించింది జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం. మంగళవారం పహల్గామ్లో జరిగిన దాడిలో ఇద్దరు విదేశీయలతో సహా మొత్తం 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రస్తుతం కాశ్మీర్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఘటనపై అప్రమత్తమై భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో దాదాపు 8-10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లు సమాచారం. 5-7 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్కు చెందినవారని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది
ఉగ్రదాడిపై హోంమంత్రి అమిత్షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి జరిగిన ఘటనా స్థలాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Amith Sha
మరో వైపు ఉగ్రదాడి విషయం తెలుసుకున్న సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ. వెంటనే బయల్దేరి భారత్కు వచ్చారు. భారత్కు వచ్చిన వెంటనే ఉన్నతాధికారులతో సమావేశమై తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ఇదే విషయంపై సాయంత్రం అత్యవసర కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మీటింగ్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..