
కాల్పులు జరిపిన స్థలానికి అతి సమీపంలో ఉన్న అడవుల్లోంచి పర్యాటక ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు చొరబడినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. విదేశీ గన్స్‌తో పాటు.. కాల్పుల ఘటనను రికార్డ్ చేసేందుకు బాడీ కెమెరాలు ధరించారని తేల్చాయి. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్న 3 స్పాట్లను ఎంచుకుని.. ఆరుగురు ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్టు అంచనాకు వచ్చాయి.
ఏప్రిల్ 22న మధ్యాహ్నం 1.50 గంటలకు ఫస్ట్ బుల్లెట్ ఫైర్ చేశారు. ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో ఉండటంతో.. తమ దగ్గరకు వచ్చే వరకు వారిని గుర్తించలేకపోయారు పర్యాటకులు. దాడులు జరిగే సమయంలో చిన్నారులు ఆడుకుంటుంటే… పెద్దలు ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. అతి సమీపం నుంచి నేరుగా పర్యాటకుల తలలపైనే గురి పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు.
కాల్పులు జరిగిన 40 నిమిషాల తర్వాత పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి రవాణా సదుపాయం సరిగ్గా లేకపోవడంతో పోలీసులు రావడానికి ఆలస్యం అయింది. 5 కిలోమీటర్లు కేవలం కాలి నడక, గుర్రాల ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోగలరు. మధ్యాహ్నం 3 గంటలకు స్పాట్‌కు చేరిన పోలీసులు సహాయకచర్యలు మొదలు పెట్టారు. పోలీసులు మరికాస్త ముందుగా వచ్చి ఉంటే కొందరి ప్రాణాలైనా కాపాడేవారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 25 మంది పర్యాటకులు, ఒక టూర్ ఆపరేటర్ మరణించినట్లు భద్రతా బలగాలు ధృవీకరించాయి. ఫైరింగ్ తర్వాత ఎటువైపు నుంచి వచ్చారో అటువైపుగానే టెర్రరిస్టులు వెళ్లిపోయినట్టు గుర్తించారు.
ఉగ్రవాదుల ఫైరింగ్ వీడియో దిగువన చూడండి…