
తెలంగాణ మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురైయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను స్థానిక ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు. వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించి పద్మారావుకు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పద్మారావు గౌడ్‌కు గుండెపోటు వచ్చిందన్న కథనాలతో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు షాక్‌కు గురైయ్యారు. ఆయన వయస్సు 70 ఏళ్లు.
పద్మారావు గౌడ్ గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్కు బలమైన నేత. ఆయన మున్సిపల్ కౌన్సిలర్ (హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ) స్థాయి నుంచి అంచలంచలుగా రాజకీయాల్లో ఎదిగారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2004లో తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2009 ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 జూన్ 2 నుంచి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యంవహిస్తున్నారు. 2019 ఫిబ్రవరి 24 నుంచి తెలంగాణ రెండో అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2014 నుంచి 2018 వరకు ఎక్సైజ్, స్పోర్ట్స్ శాఖ మంత్రిగా ఉన్నారు.