
ఓటీటీ సినీప్రియులను ఆకట్టుకునేందుకు ఇప్పుడు మరో హారర్ వెబ్ సిరీస్ అందుబాటులోకి రాబోతుంది.. అమ్మాయిల్లో హాసల్లో ఉండే అతీత శక్తులు..వాటిని ఎదురించిన ఓ యువతి జీవితమే ఈ సిరీస్. ఆ సిరీస్ పేరు ఖౌఫ్. అంటే భయం అని అర్థం. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తుంది. వచ్చే వారం ఈ సిరీస్ ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఖౌఫ్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇందులో రజత్ కపూర్, చమ్ దరంగ్ ప్రధాన పాత్రలలో నటించగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ భయపెడుతుంది. ఊహించని ట్విస్టులు.. విజువల్స్ తో ఈ సిరీస్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
స్వేచ్ఛగా తనకు తానుగా బతకాలని కలలు కంటూ ఢిల్లీకి వచ్చిన మాధురి (చమ్ దరంగ్) అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఢిల్లీకి వచ్చిన ఆమె తన బడ్జెట్ లో మారుమూల హాస్టల్లో ఓ రూమ్ దొరుకుంది. అయితే అందులోకి ఎంట్రీ ఇవ్వగానే అక్కడున్న అమ్మాయిలు మాధురిని హెచ్చరిస్తారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని.. ఆ తర్వాత వెళ్లాలనుకున్న వెళ్లలేవని అంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ గదిలో అతీత శక్తులు ఉన్నాయని తెలుసుకుంటుంది మాధురి. దీంతో వాటి వల్ల ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది.. చివరకు ఓ భూత వైద్యుడి సాయంతో ఆమె అక్కడ ఏం తెలుసుకుంది. ? చివరకు వాటి నుంచి ఆమె ఎలా బయటపడింది ? అనేది సిరీస్. ఏప్రిల్ 18 నుంచి అందుబాటులోకి రానుంది.
మరోవైపు శుక్రవారం ఓటీటీల్లో రిలీజ్ అయిన సినిమాల్లో చోరీ 2 ఒకటి. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నాలుగేళ్ల కిందట వచ్చిన చోరీ చిత్రానికి సీక్వెల్ ఇది. ఇందులో నుష్రత్ బరూచా, సోహా అలీ ఖాన్ కీలకపాత్రలు పోషించారు. అతీత శక్తుల నుంచి తన కూతురిని కాపాడుకునేందుకు ఓ అమ్మ చేసే పోరాటమే చోరీ 2.
ఇవి కూడా చదవండి :
Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్
Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‌లోకి.. పరుగు మూవీ హీరోయిన్ను ఇప్పుడే చూస్తే షాకే..
Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..
OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?