
చాలా తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఒక చిత్రం ఈ ఏడాది విడుదలైంది. యాక్షన్, రొమాన్స్ కాదు.. కడుపుబ్బా నవ్వించే కామెడీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్లలో ఇన్నాళ్లు సత్తా చాటిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఆ సినిమా పేరు ‘పోన్మ్యాన్’. ఇది మలయాళ బ్లాక్ కామెడీ చిత్రం. ఈ చిత్రం జి.ఆర్. ఇందుగోపన్ రాసిన నలంచు చెరుప్పక్కర్ నవల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే సజిన్ గోపు, లిజిమోల్ జోస్, దీపక్ పరాంబోల్, ఆనంద్ మన్మదన్ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీకి ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు ఐఎమ్డీబీలో మంచి రేటింగ్ ఉంది.
కథ విషయానికి వస్తే..
ఇవి కూడా చదవండి
ఈ కథ ఒక నగల దుకాణంలో పనిచేసే అజేష్ (బాసిల్ జోసెఫ్) చుట్టూ తిరుగుతుంది. అజేష్ ఒక అమ్మాయి పెళ్లికి బంగారు నగలు ఇస్తాడు. కానీ డబ్బు తీసుకోడు.. ఆ పెళ్లికి వచ్చే అతిథులు ఇచ్చే కట్నాలు ఇవ్వమని ఒప్పందం చేసుకుంటాడు. అయితే ఆ అమ్మాయి పెళ్లికి అతిథిలు నుంచి వచ్చిన డబ్బు తక్కువగా ఉంటుంది. దీంతో తన నగలు తిరిగి ఇవ్వమని అజేష్ అమ్మాయి తల్లికి, సోదరుడికి చెబుతాడు. కానీ అప్పుడు ఒక పెద్ద సమస్య తలెత్తుతుంది. ఆభరణాలను లాక్కోవడానికి కుట్ర ప్రారంభమవుతుంది. ఆ అమ్మాయి నుండి నగలు తిరిగి తీసుకునే వరకు తాను వెళ్ళనని అజేష్ నిర్ణయించుకుంటాడు. కానీ ఆ అమ్మాయి భర్త సైతం ఆ నగల కోసమే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. దీంతో సినిమా కథలో థ్రిల్ మరింత పెరుగుతుంది.
బాసిల్ జోసెఫ్ చిత్రం ‘పోన్మాన్’ కు జ్యోతిష్ శంకర్ దర్శకత్వం వహించారు. దీని కథ పూర్తిగా భిన్నంగా, తాజాగా ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు ఈ మూవీ ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఇక సినిమాలోని ప్రతి సీన్ మిమ్మల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ సినిమా చూడటం ప్రారంభించిన తర్వాత, చివరి వరకు ఆపాలని అనుకోరు. మరీ ఇంకెందుకు ఆలస్యం.. ఈ సినిమాను హాట్ స్టార్ ఓటీటీలో చూసేయ్యండి.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..