
ఈ ఏడాది తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి వసూళ్లు రాబట్టాయి. హారర్, మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ జానర్ చిత్రాలు దూసుకుపోతున్న సమయంలో న్యాయవ్యవస్థ అంటూ వచ్చిన ఈ చిన్న సినిమా బడ్జెట్ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ వసూలు చేసింది. ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడి హృదయాలను గెలుచుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. అదే కోర్టు: స్టేట్ వర్సెస్ నోబడీ. తెలుగులో రూపొందించిన ఈ సినిమా ఈ ఏడాది హోలీ సందర్భంగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి కీలకపాత్రలు పోషించారు.
చాలా తక్కువ బడ్జెట్ నిర్మించిన ఈ సినిమా విజయవంతమైంది. పేద కుటుంబానికి చెందిన చందు అనే యువకుడి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఉన్నత, ధనిక కుటుంబానికి చెందిన జాబిలి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు చందు. వీరిద్దరు టీనేజ్ లోనే ప్రేమలో పడతారు. కానీ వీరి ప్రేమ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో చందు జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటారు. అతడిని తప్పుడు కేసులో ఇరికించడంతో ఈ ప్రేమకథ కోర్టుకు చేరుతుంది. అక్కడే అసలు కథ ప్రారంభమవుతుంది. సినిమా మొదటి నుంచి క్లైమాక్స్ వరకు అద్భుతంగా ఉంటుంది.
కోర్డు డ్రామాగా వచ్చిన ఈ సినిమా ప్రతి క్షణం మిమ్మల్ని మరింత ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ప్రేక్షకుడికి ఆద్యంతం తెలియని క్యూరియాసిటి కలుగుతుంది. ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దేశంలోని టాప్ 10 జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. రూ.9 కోట్లతో నిర్మిస్తే.. రూ.57 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..