
బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ హీరోయిన్ రన్యా రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తరచూ దుబాయ్ వెళుతున్న ఆమె బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా రన్యారావు వద్ద ఏకంగా 12 కోట్ల విలువ చేసే బంగారం దొరకడం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉంటే రన్యా రావు నటించిన ఓ రొమాంటిక్ మూవీ ఇప్పుడు ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతోంది. అదే వాఘా. ఈ తమిళ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటించాడు. రన్యా రావుకు మాత్రం ఇదే మొదటి తమిళ సినిమా. 2016లో థియేటర్ల లో రిలీజైన వాఘా సినిమా యావరేజ్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో రిలీజైన దాదాపు 9 ఏళ్ల తర్వాత వాఘా సినిమా ఇప్పుడు జియో హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది హిందీ వెర్షన్ మాత్రమే. ఒరిజినిల్ తమిళ్ వెర్షన్ మాత్రం యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది.
వాఘా మూవీలో ఖనుమ్, కాజల్ అనే రెండు పాత్రల్లో కనిపించింది రన్యా రావు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. పాకిస్థాన్‌కు చెందిన ఖనుమ్ తన తాతయ్యను చూడటానికి ఇండియా వస్తుంది. ఇదే క్రమంలో వాసు అనే ఇండియన్ సోల్జర్ తో ప్రేమలో పడుతుంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుంది. కానీ ఇండియా- పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమె జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఖనుమ్ తిరిగి మాతృదేశానికి వెళ్లడం కష్టంగా మారుతుంది. మరోవైపు వాసు తన ప్రియురాలిని ఎలాగైనా పాకిస్తాన్ కు పంపించే బాధ్యతను భుజాన కెత్తుకుంటాడు? మరి ఖనుమ్ పాకిస్తాన్ కు వెళ్లిందా? అక్కడ ఇద్దరూ కలిసి తమ ప్రేమను గెలిపించుకున్నారా? పాకిస్తాన్ లో ఈ ప్రేమ జంటకు ఎదురైన పరిస్థితులేంటి? అన్నది తెలుసుకోవాలంటే వాఘా సినిమా చూడాల్సిందే.
రన్యా రావు వాఘా మూవీ హిందీ ట్రైలర్
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి