
హనుమాన్ ఫేమ్, ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మధుశాల. జి.సుధాకర్ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రంజాన్ కానుకగా సోమవారం (మార్చి 31) ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్‌తో పాటు మనోజ్ నందం, యానీ, తనికెళ్ల భరణి, రఘుబాబు, గెటప్ శీను, చిన్నా, రవివర్మ, ఇనయా సుల్తానా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్ఐఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తమ్ముడు సత్యం నిర్మించిన ఈ మూవీకి సెబాస్టియన్ వర్గీస్ సంగీతం అందించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ సొంతం చేసుకోగా మంగళవారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. . ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ‘మధుశాల.. ఓ ఇంటెన్స్ థ్రిల్లింగ్ కిడ్నాప్ డ్రామా. ఓ ప్లాన్, షాకింగ్ ట్విస్ట్, టైమ్‌తో రేస్. కిడ్నాపర్లను పట్టుకుని ఎమ్మెల్యే తనకు ఇష్టమైన వ్యక్తులను కాపాడుకున్నాడా.?’ అని దీనికి క్యాప్షన్ ఇచ్చింది ఈటీవీ విన్.
మధుశాల సినిమా కథేంటంటే..
ఇవి కూడా చదవండి
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఎమ్మెల్యే కోడలిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తాడు ఒక కిడ్నాపర్. ఇందుకోసం మరో ఐదుగురిని సాయం తీసుకుంటాడు . ప్లాన్ ప్రకారమే అందరూ కలిసి ఎమ్మెల్యే కోడలిని కిడ్నాప్ చేస్తారు. అయితే, ఈ క్రమంలో కిడ్నాపర్లలో ఒకరు అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోతాడు. అసలు ట్విస్ట్ అక్కడే ఎదురవుతుంది. మరి కిడ్నాప్ సంగతి ఏమైంది? కిడ్నాపర్ల నుంచి తన కోడలిని ఎమ్మెల్యే కాపాడుకోగలిగారా? ఈ క్రమంలో ఎమ్మెల్యేకు, కిడ్నాపర్లకు ఎదురైన పరిస్థితులేంటి? అన్నది తెలుసుకోవాలంటే మధుశాల సినిమా చూడాల్సిందే
ఈటీవీ విన్ లో వరలక్ష్మి సినిమా స్ట్రీమింగ్..
Madhushala
A Thrilling Kidnap Drama!A daring plan, a shocking twist, and a race against time! Will the MLA outsmart the kidnappers and save his loved one?
🎬 Watch now, only on ETV Win! 👉 https://t.co/YTNjhyRn1z#MadhushalaOnEtvwin #NowStreaming #ETVWin pic.twitter.com/tBeWYGycrU
— ETV Win (@etvwin) March 31, 2025
ఈటీవీ విన్ లోని మరిన్ని సినిమాలు..
Some stories never fade… Some bonds never break…💙
What happens when your first love from school unexpectedly walks back into your life after years?#LifePartner From #KathaSudha
Premieres April 06
Watch For Free#Etvwin pic.twitter.com/FgKtiN0ihv— ETV Win (@etvwin) April 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.