
ఇటీవల మలయాళీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రాల్లో ఎల్ 2 ఎంపురాన్ ఒకటి. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. 2019లో విడుదలై సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీని రూపొందించారు. డ్రగ్స్, ఇంటర్నేషనల్ మాఫియా, ఫ్యామిలీ ఎమోషన్స్, రాజకీయాలు వంటి అంశాల చుట్టూ ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఇందులో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలలో నటించారు. థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ థియేటర్లలో ఏకంగా రూ.262 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇన్నాళ్లు థియేటర్లలో విజయవంతగా అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా మలయాళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషలలో ఈ సినిమాను విడుదల చేయగా అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రూ.180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.262 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కేవలం దేశంలోనే రూ.121 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రానికి అంతగా రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగుతోపాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికి వస్తే..
ఐయూఎఫ్ పార్టీలో సమస్యలన్నీ సద్దుమణిగిలే చేసిన స్టీపెన్ నెడుంపల్లి (మోహన్ లాల్) అజ్ఞాతనంలోకి వెళ్తాడు. పార్టీ పగ్గాలు, అధికారం చేతికొచ్చిన తర్వాత జతిన్ రామ్ దాస్ (టొవినో థామస్) భారీగా అవినీతి చేస్తాడు. తన సోదరుడు చేస్తున్న అవినీతిని ఎదురించడానికి స్టీపెన్ మళ్లీ రంగంలోకి దిగుతాడు. దీంతో ఇద్దరు అన్నదమ్ముల మధ్య పొలిటికల్ వార్ స్టార్ట్ అవుతుంది. అది కాస్త జాతీయ స్థాయిలోకి వెళ్తుంది. అటు రాజకీయ అంశాలతోపాటు ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియాను టచ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..