
మీరు చూస్తున్న ఈ ఇమేజ్‌లో చాలా బ్రెడ్ ముక్కలు కనిపిస్తాయి. ఇవి ఒక నీలం రంగు తివాచీపై పరచబడి ఉన్నాయి. అయితే వాటి మధ్య ఒక పిల్లి ఎంతో తెలివిగా దాక్కుంది. మీరు ఈ చిత్రాన్ని తొలిసారి చూస్తే పిల్లి కనిపించదు. కానీ కొంత సమయం ఓపికతో చూస్తే మాత్రం పిల్లి ఎక్కడుందో కనిపెట్టొచ్చు.
ఈ ఛాలెంజ్‌ను చూసిన చాలా మంది యూజర్లు పిల్లిని గుర్తించలేకపోయారు. మరికొంతమంది మాత్రం కొన్ని క్షణాల్లోనే దాన్ని కనిపెట్టగలిగారు. ఇది మీ గమనశక్తిని పరీక్షించే ఒక అద్భుతమైన అవకాశం. ఇటీవల కాలంలో ఆప్టికల్ ఇల్యూషన్లు, బ్రెయిన్ టీజర్లు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటి వెనుక కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి.
మన మెదడు సహజంగానే కొన్ని నమూనాలను గుర్తించేందుకు అలవాటు పడింది. కానీ ఆప్టికల్ ఇల్యూషన్లు మన మెదడును మోసం చేస్తాయి. కొన్ని ముఖ్యమైన వివరాలను తొలిచూపులో కనిపించకుండా చేస్తాయి. మానవ మెదడు వివిధ రంగులు, ఆకృతులు, నమూనాలను గ్రహించడంలో కొన్ని సాధారణ పొరపాట్లు చేస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకుని ఈ తరహా ఇమేజ్ లు మన మెదడును మభ్యపెడతాయి.
ఇలాంటి పజిల్‌లు చాలా మందికి ఆసక్తికరమైన వినోదాన్ని అందిస్తాయి. ఎవరు ముందుగా పరిష్కరించగలరో అని యూజర్లు ఆసక్తిగా ప్రయత్నిస్తారు. దీనివల్ల ఈ ఛాలెంజ్‌లు మరింత వైరల్ అవుతున్నాయి. ఇంకా పిల్లిని కనిపెట్టలేరా..? మరోసారి బాగా ఫోకస్ చేసి చూడండి. ఈజీగా కనిపెట్టేస్తారు.
కనిపెట్టినవారికి అభినందనలు.. కనిపెట్టని వారు ఇంకా ప్రయత్నించండి. మీరు ఇంకా కనిపెట్టలేకపోతే మీ స్నేహితులకు కానీ, కుటుంబసభ్యులకు కానీ పంపి వారి సహాయం తీసుకోండి. అయినా కనిపెట్టని వారు చింతించకండి. పిల్లిని నేను వెతికిపెట్టాను చూడండి. చూసి పిల్లి అంటే ఇష్టం ఉన్నవాళ్లు తీసుకెళ్లండి.