
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ వైరల్ అవుతోంది. ఇందులో కార్టూన్ రైనోస్ మధ్య ఓ హిప్పో దాగి ఉంది. ఆ హిప్పో ను కనిపెట్టడానికి చాలా మంది తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. మరీ మీరు కనిపెట్టగలరా..? వెంటనే పాల్గొని ప్రయత్నించి చూడండి.
మీరు చూస్తున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ లో ఒక మైదానం ఉంది. ఈ మైదానంలో రైనోస్ గుంపు ఉంది. ఇవి చిన్న కాళ్లు, చిన్న చెవులు, బొద్దుగా ఉన్న శరీరంతో సరదాగా ఆకర్షించేలా ఉన్నాయి. అంతేకాదు చుట్టూ పుచ్చకాయ ముక్కలు, మొత్తం పుచ్చకాయలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని రైనోస్ లు అయితే వాటితో ఆడుతున్నట్లుగా ఉన్నాయి.
అయితే ఈ చిత్రంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీటితో పాటు కలిసిపోయి హిప్పో దాగి ఉంది. కేవలం 7 సెకన్లలో దాన్ని మీరు కనిపెట్టాల్సి ఉంటుంది. మంచి పరిశీలన నైపుణ్యం ఉన్న వారు 7 సెకన్లలో రైనోస్ మధ్య దాగిన హిప్పోను కనిపెట్టగలరా లేదా అనేది చూడండి.
ఆప్టికల్ ఇల్యూషన్స్ ఇలా ఇంతగా ఫేమస్ అవ్వడానికి కారణం అవి మన మెదడును మోసం చేసి దృష్టి కష్టతను పరీక్షిస్తాయి. ఇవి మనం చూడగానే అర్థం కాకుండా ఉండేలా రూపొందించబడుతాయి. అందుకే ఇలాంటి చిత్రాలను చూసి వాటిలో ఆసక్తిగా పాల్గొంటున్నారు.
మరోసారి బాగా ఫోకస్ చేసి చూడండి.. ఈ ప్రత్యేకమైన ఇల్యూషన్ లో హిప్పో చాలా తెలివిగా రైనోస్ మధ్య కలిసిపోయింది. వాటి ఆకారంతో పాటు రంగు తేడా లేకపోవడం వల్ల మొదటిసారి చూసినప్పుడు ఎవరికీ అర్థం కాకపోవచ్చు. అయితే కొంతమంది వీటిని క్షణాల్లో గుర్తించగలుగుతారు. మరికొంత మంది అయితే కుటుంబసభ్యులు, స్నేహితుల సలహా తీసుకోని కనిపెడుతారు.
ఇంతకీ మీరు హిప్పోని కనిపెట్టారా.. హో అయితే మీకు అభినందనలు. ఇంకా కనిపెట్టని వారు ఫీల్ అవ్వకండి. మీకోసం నేనే వెతికిపెట్టాను. బ్లాక్ కలర్ రౌండ్ చేసి ఉంచాను వెళ్లి చూడండి. తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి.