

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు దూసుకుపోతున్నాయి. కంపెనీ వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తూ వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇక పెట్రోల్,డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓలా తన ఎలక్ట్రిక్ వాహనాలపై బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అక్షయ తృతీయ శుభ సందర్భానికి ముందు ఓలా ఎలక్ట్రిక్ మొత్తం S1 పోర్ట్‌ఫోలియోపై ప్రత్యేక ఆఫర్లు, ప్రయోజనాలతో సహా 72-గంటల ఆఫర్లను ప్రకటించింది. 72 గంటల రష్లో భాగంగా వినియోగదారులు Gen 2, Gen 3 మోడళ్లపై భారీ తగ్గింపును అందిస్తోంది.
ఓలా ఎస్1 పోర్ట్ పోలియోపై బంపర్ రాయితీని ప్రకటించింది. జెన్2, జెన్3 మోడళ్లపై ఏకంగా రూ.40వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు.. ఉచితంగా వారంటీని కూడా అందిస్తోంది. ఈ తగ్గింపు ఆఫర్లు ఏప్రిల్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఓలా ఎంపిక చేసిన స్కూటర్లపై మాత్రమే ఈ ఆఫర్ల ఉండనుంది. అంతేకాదు బుకింగ్ చేసుకున్న స్కూటర్లను ఒకే రోజులో కస్టమర్లకు డెలివరీ చేయనుంది.
ఇది కూడా చదవండి: Jio Offer: జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్.. తక్కువ ధరల్లో 200 రోజుల చెల్లుబాటు ప్లాన్
ఓలా జెన్2 ఎస్1 ఎక్స్ 2kWh బ్యాటరీ సామర్థ్యంతో ఉన్న స్కూటర్ ధర రూ.67,499 (ఆఫర్లతో కలిపి)ఉంది. అలాగే 3kWh బ్యాటరీ స్కూటర్ ధర రూ.83,999 ఉండగా, 4kWh బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ. 90,999 వరకు ఉంది. అలాగే S1 ప్రో ధర రూ.1,11,999 నుంచి ప్రారంభం అవుతాయి. జెన్3 పోర్ట్‌ఫోలియోలో ఎస్1 ఎక్స్ తరహాలో తీసుకువచ్చిన స్కూటర్లలో 2kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.73,999 ఉండగా, అదే 3kWh రేటు రూ.92,999 వద్ద ఉంది. అలాగే 4kWh ధర రూ.1,04,999, అలాగే S1 ఎక్స్+ 4kWh బ్యాటరీతో ఉన్న స్కూటర్ ధర రూ.1,09,999 ఉంది. అలాగే S1 ప్రో+ 4kWh స్కూటర్ ధర రూ.1,48,999 ఉండగా, 5.3kWh కలిగిన బ్యాటరీ స్కూటర్ ధర రూ.1,88,200, Sప్రో 3kWh బ్యాటరీ స్కూటర్ ధర రూ.1,12,999 ఉంది. అలాగే 4kWh బ్యాటరీ ఉన్న స్కూటర్ వేరియంట్ ధర రూ.1,29,999గా ఉంది.
ఇది కూడా చదవండి: Best Scheme: ప్రతి నెలా రూ.12,500 పెట్టుబడితో చేతికి కోటి రూపాయలు.. బెస్ట్ స్కీమ్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..