
లేడీఫింగర్స్.. అదే బెండకాయ.. చాలా మందికి ఇష్టమైన కూరగాయ. అంతేకాదు.. బెండకాయలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు మొదలైనవి సమృద్ధిగా ఉంటాయి. అయితే, బెండకాయను కూరగా, ఫ్రైగా మాత్రమే కాదు.. బెండకాయ నీటిని తయారు చేసి కూడా తీసుకుంటారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెండకాయ నీటిని తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. లేడీఫింగర్‌లో ఉండే ఫైబర్ దీనికి సహాయపడుతుంది. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన లేడీఫింగర్ వాటర్ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీంతో వేగంగా బరువు తగ్గుతారు. బెండకాయ నీటిలో లభించే విటమిన్లు,ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
విటమిన్ ఎ, సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న లేడీఫింగర్ వాటర్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఓక్రా వాటర్‌ను ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. బెండకాయలో సల్యూబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ ఆకర్షణను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బెండకాయ నీటిని ప్రతిరోజూ తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుకోవచ్చు.
బెండకాయలో ఉండే రసాయనం పొట్టలోని ఆమ్లాలను తటస్థం చేయడంలో సహాయపడుతుంది, తద్వారా గ్యాస్, అజీర్ణం, కడుపు సమస్యలను నివారించవచ్చు. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఓక్రా వాటర్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ కె, కాల్షియం సమృద్ధిగా ఉండే ఓక్రా వాటర్ బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎముకలను బలపరుస్తుంది. ఓక్రా వాటర్ తాగడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న లేడీఫింగర్ వాటర్ చర్మానికి కూడా మేలు చేస్తుంది.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..