
మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. ఓదెలలో తిరుపతి అలియాస్ వశిష్ట ఎన్ సింహాను అతడి భార్య రాధ అలియాస్ హెబ్బా పటేల్ చంపేసిన తర్వాత ఊరు అంతా పండగ చేసుకుంటుంది. తిరుపతి శవానికి పోస్ట్ మార్టమ్ చేసి ఊరికి తీసుకొస్తే.. కనీసం ఆత్మకు కూడా శాంతి కలగకూడదని సమాధి శిక్ష వేస్తారు ఊరు జనం. దాంతో చనిపోయిన తిరుపతి ఆత్మ అక్కడే ఘోషిస్తూ ఉంటుంది. తిరుపతి మరణం తర్వాత మళ్లీ ఆ ఊళ్ళో పెళ్లిళ్లు మొదలవుతాయి. అదే సమయంలో తిరుపతి ఆత్మ మళ్లీ బయటికి వస్తుంది. ఊళ్ళో కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలను శోభనం రోజే చంపేస్తుంటుంది. ఆ మరణాల ఘోషను తట్టుకోలేక జైల్లో ఉన్న రాధమ్మ దగ్గరికి ఉపాయం కోసం వెళ్తారు ఊరు జనం. అప్పుడు వాళ్లకు తన అక్క భైరవి అలియాస్ తమన్నా గురించి చెప్తుంది. చిన్నప్పటి నుంచే నాగసాధువుగా మారిపోయి శివుడిలో ఏకం కావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది భైరవి. ఆమె ఓదెలలో అడుగు పెడుతుంది. మరి తన దైవశక్తితో దుష్టశక్తిని అంతం చేసిందా లేదా అనేది అసలు కథ..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మి.. రైలు పట్టాలపైకి కారును పోనిచ్చాడు.. ఏం జరిగిందంటే..
దినసరి కూలీకి రూ.4 కోట్ల ఆదాయపు పన్ను
పవన్ భార్యపై విమర్శలు.. రంగంలోకి దిగి సీరియస్ అయిన విజయశాంతి
బట్టలిప్పి నా ముందు నిలుచో.. హీరోయిన్‌కు సెట్లోనే స్టార్ హీరో వేధింపులు
30 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. వరుడి వయసెంతో తెలుసా ??