
ప్రపంచంలో దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. భర్త ఎంత చేసినా ఇంకా ఏమీ తేలేదు అని ఫీల్ అయ్యేది భార్య మాత్రమే.. అవును భార్యలు దాదాపు ఎప్పుడూ భర్త చేసే పనుల పట్ల అసంతృప్తితోనే ఉంటారు. ముఖ్యంగా భర్తలు పెళ్లి రోజు, పుట్టిన రోజు వంటివి కూడా గుర్తు పెట్టుకోరు అంటూ పిర్యాదులు తరచుగా భార్యల నుంచి వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది భార్యలు తమ భర్తకు ఏ పని చెప్పినా గుర్తు పెట్టుకోరు అంటూ కంప్లైంట్ చెబుతారు. అయితే సర్వసాధారణంగా పురుషులందరికీ సెలెక్టివ్ హియరింగ్ ఉంటుందట. అంటే భార్య చెప్పే విషయాలను భర్త వినరట. ఒకవేళ విన్నా.. వాటిని పెద్దగా పట్టించుకోరు. భార్య చెప్పిన విషయాలను ఫాలో అవ్వరు కూడా.. ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలు తమ భార్యలు చెప్పే విషయాలను అసలు వినరట. ఈ రోజు ఏ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు తమ భార్య మాట వినరో తెలుసుకుందాం..
ఏ నెలలోనైనా 1వ, 10వ, 19వ, 28వ తేదీలు (సూర్యునితో పాలించే తేదీలు)
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు జన్మతః నాయకులు. వీరు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు చేసే ప్రతి సంభాషణను ఒక ప్రేరణాత్మక ప్రసంగంగా నమ్ముతారు. అందుకే.. వీరు తాము చెప్పిందే అందరూ వినాలి అని అనుకుంటారు. వీరి చెప్పేది అందరూ వినాలని అనుకుంటారు. కానీ వీరు ఇతరులు చెప్పేది అసలు వినరు. ఎదుకంటే ఇతరులు చెప్పే విషయాలు పెద్దగా ఉపయోగం అని వీరు భావించరు. అన్నీ తమకే తెలుసు అని అహంకారం వీరికి ఎక్కువ. అందుకే వీరు భార్య మాటని అసలు వినరు.
ఏ నెలలోనైనా 5వ, 14వ, 23వ తేదీలు (బుధుడు పాలించేది)
ఈ తేదీల్లో జన్మించిన వారు మంచి వక్తలు. ఎవరు ఏమి చెప్పినా అద్భుతంగా వింటారు. అయితే భర్త చెబితే మాత్రం తమకు ఏదీ వినిపించడం లేదు అన్నట్లు ఉంటారు. భార్య మాట్లాడుతుంటే అకస్మాత్తుగా వినికిడి సమస్యలు తలెత్తుతుంది వీరికి. అయితే భార్య కాకుండా ఇతరులు ఏమి చెప్పినా ఎంతో ఆసక్తిగా వింటారు. వీరు ప్రపంచ రాజకీయాల గురించి ఉద్రేకంతో చర్చిస్తారు.. కానీ కిరాణా సామాను తీసుకెళ్లమని గుర్తు చేసినప్పుడు మౌనంగా ఉంటారు.
ఇవి కూడా చదవండి
ఏ నెలలోనైనా 9వ, 18వ, 27వ తేదీలు (కుజుడు పాలించేది)
ఏ నెలలోనైనా 9వ, 18వ, 27వ తేదీలో పుట్టిన వారు ఎల్లప్పుడూ ఒక లక్ష్యంలో ఉంటారు. ఎల్లప్పుడూ హడావిడిగా ఉంటారు. ఎదుటివారు చెప్పింది వినరు. ముఖ్యంగా తమ భార్యలు చెప్పేది మాత్రం అస్సలు వినరు. పట్టుపట్టి భార్య ఏదైనా చెబితే.. హహ్? అవును, ఖచ్చితంగా అంటూ విన్నట్లు తల ఊపుతారు. ఖచ్చితంగా భార్య మాట వినరు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.