
మ్యాన్ మాస్ నటించిన దేవర సినిమా 2024 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. జూనియర్ ఎన్టీఆర్ (NTR) ద్విపాత్రలో అద్భుతంగా నటించారు. అలాగే బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ఇది జాన్వీ కపూర్‌కి తొలి తెలుగు సినిమా. “దేవర: పార్ట్ 1″ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 172 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రూ.550 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. 6 కేంద్రాల్లో 100 రోజులు, మరో 2 కేంద్రాల్లో కంటిన్యూ ఆటతో 100 రోజులు పూర్తి చేసుకుంది దేవర సినిమా.
అలాగే దేవర నవంబర్ 8, 2024 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. నాన్-ఇంగ్లీష్ సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలతో నాలుగో స్థానంలో నిలిచింది దేవర సినిమా.”దేవర” జపాన్‌లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మార్చి 19, 2025న జపాన్‌లో ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది. అక్కడ కూడా దేవర సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సహం రెట్టింపైంది. ఇక ఎన్టీఆర్ కు జపాన్ లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా అక్కడ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ అవ్వనుండటంతో జపాన్ అభిమానులు సందడి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తాజాగా జపాన్ ఫ్యాన్స్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ కటౌట్ పెట్టి దానికి పూజ చేసేస్తున్నారు కొంతమంది జపాన్ అమ్మాయిలు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే “దేవర: పార్ట్ 2” గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2లో నటిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడానటిస్తున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు తారక్.
🇮🇳祝デーヴァラ日本公開🇯🇵
インドのファンが建物の上からざばーって垂れ幕を下ろすアレに憧れて、ミニ垂れ幕を作りました。@devaramovie_jp. #DEVARA #デーヴァラ #DevaraInJapan pic.twitter.com/FjAP0hbuce
— 🇯🇵 ぼらこ నా పేరు నావోరి / Nickname:Shilpa (@QUEENjiyko) March 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..