
గోరింటాకు సీరియల్ తో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోయాడు నిఖిల్ మళియక్కల్. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అడుగు పెట్టి ఏకంగా విజేతగా నిలిచాడు. సీరియల్స్, టీవీ షోల సంగతి పక్కన పెడితే నిఖిల్ గోరింటాకు సీరియల్ లో తనతో కలిసి నటించిన కావ్యతో ప్రేమలో ఉన్నాడని అందరికీ తెలుసు. వీరిద్దరూ కలిసి పలు టీవీ షోల్లో పార్టిసిపేట్ చేశారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎక్కడైనా వీరు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. సోషల్ మీడియా పేజీలు కూడా ఉన్నాయి. అయితే ఇదంతా బిగ్ బాస్ ముందు వరకు. ఏమైందో కానీ ఈ రియాలిటీ షోకు ముందే ఈ లవ్ బర్డ్స్ విడిపోయారు. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయాన్ని నిఖిల్ బిగ్ బాస్ షో లోనే చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఎప్పటికైనా కావ్యనే తనే భార్య అని.. కాళ్లు పట్టుకుని బతిమాలైనా సరే తన లైఫ్ లోకి తిరిగి తెచ్చుకుంటానంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే కావ్య మనసు మాత్రం కరగలేదు. కొన్ని టీవీ షోల్లో నిఖిల్ ఎదురు పడినా చూసీ చూడనట్లు వెళ్లిపోయింది. దీంతో నిఖిల్ కూడా క్రమంగా కావ్యకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇటీవల కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్లో నిఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఎపిసోడ్లలో కనిపించి తర్వాత కనుమరుగయ్యాడు. దీంతో వీరిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో తెలియక అభిమానులు తికమకపడుతున్నారు. ఈ ప్రేమ జంట కలవాలని ఇద్దరిని ట్యాగ్ లు చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
తాజాగా ఈ విషయంపై నిఖిల్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీరు చూపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. కాకపోతే నాదో చిన్న విజ్ఞప్తి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. ఎవరి జీవితాలు వాళ్లు గడిపేస్తున్నాం. కాబట్టి దయచేసి నన్ను ఎవరితోనూ కలపకండి. ప్రొఫెషనల్ గా కాకుండా ఇంకా ఏ ఉద్దేశంతో అయినా సరే.. నన్ను ఎవరితోనూ లింక్ చేయకండి.. అలాగే ఎవరి పోస్టులకూ నన్ను ట్యాగ్ చేయకండి. మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ ప్రేమ, సపోర్ట్ నాకెప్పటికీ ఇలాగే కావాలి. ఐ లవ్యూ ఆల్ ‘ అని ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చాడు నిఖిల్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.