
ఉదయం నిద్రలేచిన వెంటనే మెడ నొప్పి అనిపిస్తే.. ఒక్కసారిగా ఎటువంటి పని చేయకూడదు. ముందుగా నెమ్మదిగా మెడను కదిలించాలి. మెడ కండరాలను రిలాక్స్ చేయడానికి తలను మెల్లగా కుడివైపు తిప్పండి, కొన్ని సెకన్ల తర్వాత ఎడమవైపు తిప్పండి. అలాగే తలను పైకి, కిందకు కదిపితే అక్కడి కండరాలకు నెమ్మదిగా ఊరట లభిస్తుంది.
మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వేడి లేదా చల్లటి నీటితో మాయిశ్చరైజింగ్ చేయడం బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో హాట్, కోల్డ్ కాంప్రెషన్ ప్యాడ్స్ దొరుకుతాయి. వీటిని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచితే మెడ కండరాలు నిగ్రహం తగ్గి, నొప్పి ఉపశమనం పొందుతుంది. ఇంట్లోనే చేయాలంటే, శుభ్రమైన బట్టను వేడినీటిలో ముంచి మెడపై ఉంచాలి. అలాగే చల్లని నీటిలో ముంచి కూడా ప్రయత్నించొచ్చు. రోజుకు 2-3 సార్లు ఇలా చేస్తే మెడ నొప్పి తగ్గుతుంది.
అధికంగా మెడ నొప్పి అనిపించినప్పుడు వేడి నీటితో స్నానం చేయడం మంచి పరిష్కారం. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి స్నానం చేస్తే మెడ కండరాలు మెత్తబడతాయి. ఇది కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా.. మెడ భాగంలో రక్తప్రసరణను మెరుగుపరిచేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల వాపు కూడా తగ్గే అవకాశం ఉంది.
మెడ నొప్పి తగ్గించుకోవాలంటే.. కొబ్బరి నూనె, నువ్వుల నూనె లేదా బాదం నూనెను కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో మృదువుగా మర్దన చేయాలి. మర్దన వల్ల కండరాలు మరింత శాంతించడంతో పాటు వాపు, నొప్పి తగ్గుతాయి. ఈ విధానం రాత్రి పడుకునే ముందు చేస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
మెడ నొప్పి ఎక్కువ మంది అనుభవించే సాధారణ సమస్య. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉంది. పై చెప్పిన చిట్కాలను పాటిస్తే మెడ నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)