
నయనతార ఇప్పటివరకు 80 కి పైగా సినిమాల్లో నటించింది. ఆమె తనను తాను దక్షిణ భారత పరిశ్రమకే పరిమితం చేసుకోలేదు. ఆమె రజనీకాంత్, షారుఖ్ ఖాన్, నాగార్జున, జయరామ్ వంటి ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు. 2015లో, ఆమె ‘నానం రౌడీ ధన్’ సినిమా సెట్స్‌లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను కలిసింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆరేళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2022లో వివాహం చేసుకున్నారు. ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. నయనతార పెళ్లి వేడుక ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ అనే డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. నయనతార ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
ఆ సినిమా సూపర్ హిట్ అయినా, షారుఖ్ ఖాన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఆమె హిందీ సినిమాల్లో మరింత యాక్టివ్‌గా మారడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు 10 కోట్లు పారితోషికం తీసుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా నయన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆదర్శకుడు తనను అవమానించాడని తెలిపింది నయన్. దర్శకుడు చేసిన పనికి తల దించుకు వెళ్ళాను అని తెలిపింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. నిజానికి నేను పార్ధీబన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవ్వాలి.. ఆడిషన్స్ కూడా ఇచ్చా.. ఓకే కూడా చేశారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను మొదటి రోజే షూటింగ్ కు ఆలస్యంగా వెళ్ళాను. దాంతో పార్ధీబన్ అందరి ముందు నన్ను తిట్టారు. నువ్వు ఈ సినిమాకు అవసరం లేదు, వెళ్ళిపో అంటూ అరిచి నన్ను తిట్టారు. ఆయన తిట్టినందుకు నాకు బాధ కలగలేదు. కానీ అందరి ముందు తిట్టినందు చాలా బాధగా అనిపించింది. అందరి ముందు నన్ను అవమానించడంతో నా మనసు చాలా బాధ పడింది. క్షమించమని అడగలనుకున్నా కానీ దైర్యం లేక అక్కడి నుంచి తల దించుకొని వెళ్ళిపోయాను అని తెలిపింది నయనతార. ఆతర్వాత నయన్ ఎంతో కష్టపడి ఎదిగింది. ఇప్పుడు ఆమె ఓ స్టార్ హీరోయిన్. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్స్ తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూస్తుంటారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..