
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్లో ఎమర్జెన్సీ డెస్క్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జమ్మూకాశ్మీర్‌కు వెళ్లిన ప్రయాణికులను సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు ఎమర్జెన్సీ డెస్క్ ఏర్పాటు చేసినట్టు మంత్రి లోకేష్ తెలిపారు. బాధితులకు ఎటువంటి సహాయం అవసరం అయినా 9818395787 నంబర్ కు కాల్ చేయాలని తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడి బాధితుల కోసం ఢిల్లీ ఏపీ భవన్ లో ఎమర్జెన్సీ డెస్క్ ఏర్పాటు చేశాం. బాధితులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎటువంటి సహాయం అవసరం అయినా 9818395787 నంబర్ కు కాల్ చేయండి#PahalgamTerroristAttack pic.twitter.com/G7JA8s8Xdz
— Lokesh Nara (@naralokesh) April 23, 2025
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు తెలుగువారు చనిపోయారు. విశాఖ జిల్లా పాండురంగపురంకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమళి ఉగ్రవావాదుల కాల్పుల్లో మృతి చెందాడు. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. దీంతో ప్రత్యేక విమానంలో చంద్రమౌళి మృతదేహాన్ని విశాఖకు తీసుకు రానున్నారు.
ఈ ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావాలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కూడా చనిపోయారు. బెంగళూరులోని స్థిరపడ్డ మధుసూదన్ IBM సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లగా ఘటన ఈ దుర్ఘటన జరిగింది. మధుసూదన్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె ఇంటర్చదువుతుండగా, కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..