
తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించింది.
ఈ సినిమాతో నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు చైతూ. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆయన విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో కలిసి ఓ మైథికల్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్య షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
ఏప్రిల్ రెండో వారంలో హైదరాబాద్ లో ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ క్రమంలోనే చైతూ ఇప్పుడు తన 25వ సినిమా పై ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. కిశోర్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చిందని సమాచారం.
ఆ కథలో తన పాత్ర కూడా వైవిధ్యభరితంగా ఉండడంతో సినిమా చేసేందుకు చైతూ సిద్ధమవుతున్నాడని.. ఈ మూవీకి సంబంధించ నిర్మాణ వ్యవహారాలన్నీ ఓ కొలిక్కి వచ్చాకా ఈ ప్రాజెక్ట్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారని టాక్. ఇక ఇందులో నటించే హీరోయిన్