
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాడు యూట్యూబర్ అన్వేష్. దీనికి సంబంధించి అన్వేష్ స్వయంగా ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ సజ్జనార్‌తో మాట్లాడాడు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ బెట్టింగ్ ను సీరియస్ గా తీసుకుంది. డబ్బులు తీసుకుని ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తోన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సినీ సెలబ్రిటీలపై కొరళా ఝుళిపించేందుకు రెడీ అవుతోంది.ఇప్పటికే సన్నీ యాదవ్, హర్షసాయి వంటి తెలుగు యూట్యూబర్లపై కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే సినీ ప్రముఖులకు కూడా నోటీసులు వెళుతున్నాయి. కాగా ఈ విషయానికి సంబంధించి హర్ష సాయి, పల్లవి ప్రశాంత్ తదితర సెలబ్రిటీల పేర్లను అన్వేషే బయట పెట్టాడు. ఈ సందర్భంగా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అతను టాలీవుడ్ హీరోల మంచి తనం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మహేష్ బాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ లు చేపడుతోన్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి అతను మాట్లాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.
‘ఒక చేతితో చేసిన సాయం రెండో చేతికి కూడా తెలీయకూడదలంటారు. అదీ మన భారతదేశ సంస్కృతి. మహేష్ బాబు గారు వేలాది మంది పిల్లలకి ఉచితంగా గుండె సర్జరీ చేయించారు. ఇది చాలా మందికి తెలియదు. దీని గురించి ఒక్క వీడియో అయినా బయటికొచ్చిందా.. ఎంతోమంది చిన్న పిల్లల ప్రాణాలు కాపాడిన దేవుడు.. ఇదీ సాయమంటే’.
ఇవి కూడా చదవండి
‘నందమూరి తారక రామారావు గారి తనయుడు బాలకృష్ణ గారు వాళ్ల అమ్మ గారి పేరు మీద పెట్టిన బసవతారకం ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి క్యాన్సర్‌కి చికిత్స చేస్తున్నారు. ఎక్కడైనా వీడియోలు తీసి పెడుతున్నారా? ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నారు.. ఆయనా దేవుడే.. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో మందికి ఆపన్న హస్తం అందించారు’ అని అన్వేష్ చెప్పుకొచ్చాడు.
వీడియో ఇదిగో..
Naa Anveshana About SUPERSTAR @urstrulyMahesh , Ballaya Babai , Powerstar @PawanKalyan & Ratan Tata Garu 🙏🏻❤️ pic.twitter.com/VfXkMPNiwz
— Dr Vignesh™ (@VigneshDHFM007) March 17, 2025
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ముఖ్యంగా పవన్, మహేష్, బాలయ్య ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
అన్వేష్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.