
మయన్మార్, మార్చి 29: భారత్ పొరుగు దేశం మయన్మార్‌లో శుక్రవారం చోటు చేసుకున్న వరుస భూకంపాలు మృత్యుఘోష మోగించాయి. వందల కొద్ది భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద జనాలు పిట్టల్లా నలిగిపోయారు. ఇదిలా ఉంటే శుక్రవారం అర్ధరాత్రి 11:56 గంటల ప్రాంతంలో మయన్మార్‌లో మరోమారు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రత నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం మార్చి 28 రాత్రి 23:56:29 గంటలకు మూడోసారి భూకంపం వచ్చింది. భూమి అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ (NCS) తెలిపింది. దీనిచుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు మొదలయ్యే అవకాశం ఉందని ఎన్సీఎస్ పేర్కొంది. మరోవైపు అఫ్ఘానిస్థాన్‌లో కూడా శనివారం తెల్లవారుజామున 5.16 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 4.7గా నమోదైంది. భూమి అంతర్భాగంలో 180 కిలోమీటర్ల లోపల కదలకలు సంభవించాయి.
కాగా శుక్రవారం ఉదయం 11:50 గంటలకు సంభవించిన భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రత మయన్మార్‌ను కుదిపివేసాయి. బ్యాంకాక్, థాయిలాండ్‌లోని అనేక ప్రాంతాలలో శక్తివంతమైన భూకంపంనలు చోటు చేసుకున్నాయి. దీంతో వందలాది మంది జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. మయన్మార్‌లో ఇరావడి నదిపై ఉన్న రోడ్డు వంతెన నదిలోకి కూలిపోయింది.
ఇవి కూడా చదవండి
#Earthquake in Bangkok!! pic.twitter.com/P0mLMX0C9p
— March (@MarchUnofficial) March 28, 2025
భూమి ఉపరితలానికి దగ్గరగా ఎక్కువ శక్తి విడుదల కావడం వల్ల ఇంతటి అనర్ధం చోటు చేసుకుంది. భూమిలోపల సంభవించే లోతైన భూకంపాలతో పోలిస్తే, ఈ రకమైన ఉపరితల భూకంపాలు అత్యంత ప్రమాదకరమైనవి. దీనివల్ల బలమైన భూమి కంపనాలు, భూమిపై ఉన్న నిర్మాణాలు తీవ్రంగా దెబ్బతింటాయి. భూకంపం కారణంగా మయన్మార్ రాజధాని నేపిడాలో 1000 పడకల దవాఖాన కుప్ప కూలిపోయింది.
OMG! This is on the top of a high-rise building in Bangkok just after the M7.7 earthquake struck Myanmar 😱 pic.twitter.com/plEBYm4abl
— Volcaholic 🌋 (@volcaholic1) March 28, 2025
బ్యాంకాక్‌లోని చుత్‌చాక్ పరిసరాలలో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం నిలువునా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 78 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మయన్మార్ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 700 మంది చనిపోయినట్లు సమాచారం. 1670 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో అక్కడి స్కూళ్లు, కాలేజీలు, ట్రైన్ సర్వీసులను ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది.
Just experienced a 7.7 strength #earthquake in #Bangkok for close to 3 minutes. Its epicenter was Mandalay, Myanmar, over 1200 kms from here.
Despite the distance it swayed buildings; caused cracks, forced evacuations and rooftop pools cascaded much water to down below. Scary! pic.twitter.com/iIeV7WQWN6
— Joseph Çiprut (@mindthrust) March 28, 2025
కాగా మయన్మార్‌లో భూకంపాలు రావడం ఇదేం తొలిసారి కాదు. తరచూ ఈ దేశంలో భూకంపాలకు సంభవిస్తుంటాయి. యురేషియన్, ఇండో-ఆస్ట్రేలియన్ ప్లేట్ల మధ్య ఘర్షణ కారణంగా మయన్మార్‌లో తరచూ భూకంప ప్రమాదాలు జరుగుతుంటాయి.1990 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం మయన్మార్, దాని చుట్టూ పరిసరాల్లో దాదాపు 140 సార్లు భూకంపాలు వచ్చాయి.
INCREDIBLE VIDEO SHOWS THE MOMENTS WHEN A ROOFTOP POOL IN EARTHQUAKE ZONE EMPTIES ONTO A ROAD… PEOPLE ARE SWEPT OFF THEIR FEEL #Earthquake shaking felt across much of southern Asia following a major 7.7 earthquake that rocked #Myanmar #MyanmarEarthquake pic.twitter.com/KZTpRAZZEX
— Mike Masco (@MikeMasco) March 28, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.