
ఎలాంటి మచ్చలు, ముడతలు లేకుండా చర్మం అందంగా, మెరుస్తూ ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది. చాలా మంది ఇలాగే కావాలి అనుకుంటారు. కానీ వాతావరణంలోని పరిస్థితులు, తినే ఆహారం, కాలుష్యం కారణంగా చర్మంలో మార్పులు వస్తాయి.
చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తానీ మట్టి ఎంతో చక్కగా పని చేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేయడంలో ముల్తానీ ఫేస్ ఫ్యాక్స్ని మీ కోసం తీసుకొచ్చాం. మరి ఆ ఫ్యాక్ ఏంటో.. ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేయండి.
ఒక గిన్నెలో కొద్దిగా ముల్తానీ మట్టి, ఒక స్పూన్ శనగ పిండి, పాలు, పెరుగు కొద్దిగా వేసి మిక్స్ చేయాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి, మెడకు పట్టించి ఓ పావు గంట సేపు అలానే ఉంచాలి. ఆ తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే.. ముఖం క్లీన్‌గా, గ్లోయింగ్‌గా మారుతుంది.
రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా నిమ్మరసం, చిటికెడు పసుపు వేసి అంతా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.. ఓ పావు గంట సేపు తర్వాత కడగాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ మెడ్స్, మృత కణాలు పోయి.. చర్మం సాఫ్ట్‌గా మారుతుంది.
ముల్తానీ మట్టిలో కొద్దిగా బంగాళ దుంప గుజ్జు లేదా రసం తీసుకోవాలి. కొద్దిగా టమాటా రసం కూడా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఓ పావు గంట అలానే ఉంచి కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం రంగు మారుతుంది. ఇలా ఎన్నో రకాల ఫేస్ ప్యాక్స్ వేసుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)