
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ చరిత్రలో 200 మందిని అవుట్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) మ్యాచ్ 30లో ఈ ఘనత సాధించాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని ఈ అరురైన లిస్ట్‌లో చేరాడు. లక్నోకి చెందిన ఆయుష్ బడోని 14వ ఓవర్లో రవింద్ర జడేజా బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. ధోని తెలివిగా 200వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
చారిత్రాత్మక రికార్డు సృష్టించిన ధోనీ..
ధోని ఈ లీగ్ చరిత్రలో 200 మందిని అవుట్ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ లెజెండ్‌లో అతని పేరు సువర్ణాక్షరాలతో నమోదైంది. చెన్నై కెప్టెన్ 3 వికెట్లను పడగొట్టాడు. స్టంప్స్ వెనుకాల తన అద్భుతమైన స్కిల్స్‌తో బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు.
రిషబ్ పంత్ క్యాచ్ తీసుకోవడం ద్వారా లక్నో కెప్టెన్‌ను 63 (49) వద్ద అవుట్ చేశాడు. అంతకుముందు బదోనిని స్టంప్ చేశాడు. ఆ తర్వాత మథీష పతిరానా విసిరిని లెగ్ సైడ్‌లో వైడ్ బాల్‌తో నాన్-స్ట్రైకర్ అబ్దుల్ సమద్‌ను రనౌట్ చేశాడు. ధోని ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఇప్పుడు 270 ఇన్నింగ్స్‌లలో 201 ఐపీఎల్ వికెట్లను సాధించాడు. ఇందులో 46 స్టంపింగ్‌లు, 155 క్యాచ్‌లు ఉన్నాయి.
ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన కీపర్లు..
201* – ఎంఎస్ ధోని
182 – దినేష్ కార్తీక్
126 – ఎబి డివిలియర్స్
124 – రాబిన్ ఉతప్ప
118 – వృద్ధిమాన్ సాహా
116 – విరాట్ కోహ్లీ
కెప్టెన్ రిషబ్ పంత్ చివరకు తన ఫామ్‌ను తిరిగి పొందడం విశేషం. పంత్ 63 (49) పరుగులతో లక్నో తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు నమోదు చేసింది. అబ్దుల్ సమద్ (11 బంతుల్లో 20), ఆయుష్ బదోని (17 బంతుల్లో 22), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 30) అందరూ అతనికి బలమైన మద్దతు ఇచ్చారు. చెన్నై తరపున అన్షుల్ కాంబోజ్ (1/20, 3 ఓవర్లు), నూర్ అహ్మద్ (0/13) పొదుపుగా బౌలింగ్ చేయగా, రవీంద్ర జడేజా (2/24, 3 ఓవర్లు), మథీష పతిరానా (2/45) వికెట్లు పడగొట్టారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..