
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 8 జీబీ +256 జీబీ వేరియంట్ ఫోన్‌పై బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఫోన్‌ను రూ.31,999 ధరతో రిలీజ్ చేశారు. 68 వాట్స్ ఫాస్ట్ చార్జ్ అడాప్టర్‌తో వచ్చే ఈ ఫోన్ ప్రస్తుతం రూ.27,999కే కొనుగోలు అందుబాటులో ఉంది. అలాగే అదనంగా రూ. 1,400 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉండడంతో ఈ ఫోన్ ధర రూ. 26,599కి తగ్గింది. అలాగే 125 వాట్స్ అడాప్టర్‌తో కూడిన ఎడ్జ్ 50 ప్రోక సంబంధించిన 12జీబీ + 256 జీబీ వేరియంట్‌ను ప్రారంభ ధర రూ. 35,999కి బదులుగా రూ. 29,999కే అందుబాటులో ఉంచారు. ఈ హై-ఎండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌పై కస్టమర్లు రూ. 3,400 బ్యాంక్ తగ్గింపును పొందవచ్చు. అంటే ఈ ఫోన్‌ను కేవలం రూ. 26,599కే సొంతం చేస్తుకోవచ్చు. ఈ ఫోన్ లక్స్ లావెండర్, బ్లాక్ బ్యూటీ, మూన్లైట్ పెరల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ 144 హెచ్‌జెడ్ డిస్ప్లే, ఐపీ 68 రేటింగ్, సూపర్-ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది. 2,000 నిట్ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.7 అంగుళాల 1.5కే పీఓఎల్ఈడీ డిస్ప్లేతో వచ్చే ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్ఓసీ ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది. అందువల్ల ఈ ఫోన్ గేమింగ్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుటుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో మూడు సంవత్సరాల ఓఎస్ అప్గ్రేడ్లు, నాలుగు సంవత్సరాల సాధారణ భద్రతా అప్డేట్లు ఇస్తామని ప్రకటించింది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ ఓఐఎస్ మద్దతుతో 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13 ఎంపీ అల్ట్రావైడ్ మాక్రో విజన్ కెమెరా ఆకట్టుకుంటుంది. 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10 ఎంపీ టెలిఫోటో షూటర్ ఈ ఫోన్ ప్రత్యేకత. అలాగే సెల్ఫీల కోసం 50 ఎంపీ కెమెరాతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ 125 వాట్స్ వైర్డు, 50 వాట్స్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఉన్న ప్రీమియం-గ్రేడ్ ఫీచర్లతో మధ్య-శ్రేణి ఫోన్ కోసం చూస్తున్న వారికి గొప్ప అవకాశం అని నిపుణులు చెబుతున్నారు. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో మంచి ఎంపికగా ఉన్నప్పటికీ రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్, రియల్ మీ 14 ప్రో ప్లస్ వంటి ఫోన్లు కూడా ఈ ఫోన్‌కు గట్టి పోటీనిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..