
ఇటీవలి కాలంలో చాలా మందికి ఆరోగ్య స్పృహ పెరిగింది. అందుకే అనేక విధాలుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మన ఆరోగ్యం ఎలా ఉంది? మనకు ఎలాంటి సమస్యలు వస్తాయో? తెలుసుకోవడం ఎలా..? అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా.. నిజానికి, మన నడక, వ్యాయామం, ధ్యానం, యోగా వంటి వివిధ రకాల శారీరక కార్యకలాపాలు ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయి.
కానీ ప్రతిరోజూ మన శరీరం మనకు ఇచ్చే సంకేతాల ద్వారా మన ఆరోగ్యాన్ని తనిఖీ చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామని చెప్పే లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో ఉదయం కనిపించే సంకేతాలను బట్టి చెప్పవచ్చు. ముఖ్యంగా ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఆది వెంటనే మన నాలుక చెప్పేస్తుంది. కాబట్టి నాలుకపై తెల్లటి పూత లేకుండా గులాబీ రంగులో ఉండటం మంచి ఆరోగ్యానికి సంకేతం.
ఉదయం నిద్ర లేచినప్పుడు ఎలాంటి అలసట, నొప్పి లేకుండా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. రాత్రిపూట వచ్చిన కలలను గుర్తుంచుకోగలగడం మంచి ఆరోగ్యానికి సంకేతం.
ముక్కు దిబ్బడ లేకపోవడం, ఉబ్బరం లేకపోవడం, ముఖం వాపు లేకపోవడం, ఉదయం నిద్ర లేచినప్పుడు కొంచెం ఆకలిగా అనిపించడం మంచి ఆరోగ్య లక్షణాలు. అలాగే ఉదయం నిద్ర లేవగానే ఉత్సాహంగా ఉండటం, అత్యవసరంగా మూత్ర విసర్జన, మల విసర్జన చేయవలసి రావడం ఇవన్నీ మంచి ఆరోగ్యాన్ని సూచించే సంకేతాలే.