
Telugu Astrology: ఈ నెల(మార్చి) 15, 16 తేదీల్లో చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఈ గ్రహాన్ని శని మినహా మిగిలిన ఏడు గ్రహాలూ వీక్షించడం జరుగుతుంది. వృషభం నుంచి గురువు, మిథునం నుంచి కుజుడు, మీన రాశి నుంచి శుక్ర, రవి, బుధ, రాహువులు చంద్రుడిని వీక్షించడం వల్ల మన సులోని ఎటువంటి కోరికైనా నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆరుకు మించి గ్రహాలు చంద్రుడిని వీక్షించడాన్ని చతుస్సాగర యోగంగా, చక్రవర్తి యోగంగా జ్యోతిషశాస్త్రంలో అభివర్ణించడం జరిగింది. ఈ రెండు రోజుల్లో కొన్ని రాశులవారు ఎంత సానుకూల దృక్పథంతో అంత మంచి జరుగుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులకు ఇది తప్ప కుండా యోగాన్ని కలిగిస్తుంది. ఇది మార్చి 29 అమావాస్య వరకూ కొనసాగుతుంది.
- వృషభం: ఇతర రాశులన్నిటికంటే అదృష్టవంతులయ్యే రాశి వృషభ రాశే. మనసులోని కోరికలు, ఆశల్లో చాలావరకు నెరవేరుతాయి. అంచనాలకు మించి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
- మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న కేతువుతో కలిసి ఉన్న చంద్రుడి మీద ఆరు గ్రహాల దృష్టి పడ డం వల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు చేపట్టడం జరుగుతుంది. ఒక సంస్థకు అధి పతి అయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగు లకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- కర్కాటకం: రాశినాథుడైన చంద్రుడు తృతీయ స్థానంలో ఉండడం ఒక విశేషం కాగా, దాన్ని ఆరు గ్రహాలు వీక్షించడం మరో విశేషం. ఈ రాశివారు ఈ రెండు రోజులు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. మనసులోని కోరికల్లో చాలా భాగం నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అత్యంత ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు వృద్ధి చెందుతాయి. ఆదా యం బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
- కన్య: ఈ రాశిలో ఉన్న లాభాధిపతి చంద్రుడిని మూడు శుభ గ్రహాలతో సహా ఆరు గ్రహాలు వీక్షించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల అత్యధికంగా లాభాలు కలుగుతాయి. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
- వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న చంద్రుడి మీద అత్యధిక సంఖ్యలో గ్రహాల దృష్టి పడడం వల్ల ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు అనేకం చేస్తారు. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
- మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న చంద్రుడి మీద శుభ గ్రహాలతో సహా ఆరు గ్రహాల దృష్టి పడడం వల్ల చంద్రుడి బలం బాగా పెరుగుతుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలు వెళ్లడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న నిరుద్యోగుల కల నెరవేరుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.