
Ugadi 2025 Astrology: ఉగాది పంచాంగంలో పేర్కొనే కందాయ ఫలాలకు జ్యోతిషశాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ నెల 30 నుంచి ఉగాది పేరుతో ప్రారంభమయ్యే కొత్త తెలుగు సంవత్సరంలో వివిధ రాశులవారి ఆదాయ, వ్యయ ఫలితాలను ఇది గ్రహాల స్థితిగతులను బట్టి సూచనప్రాయంగా ఈ కందాయ ఫలాల ద్వారా తెలియజేయడం జరుగుతోంది. వీటిని బట్టి వివిధ రాశుల వారు తమ వార్షిక బడ్జెట్ ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీవిశ్వావసు నామ సంవత్సర పంచాంగంలో పేర్కొన్న కందాయ ఫలాలను బట్టి వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తులా రాశుల వారికి ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువగా ఉన్నందువల్ల వీరికి ఆర్థికంగా బాగా గడిచిపోయే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశికి ఆదాయం 11, వ్యయం 5 అయినందువల్ల 2026 ఏప్రిల్ వరకూ ఆదాయానికి లోటుండక పోవచ్చు. ఉద్యోగులకు జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాలు బాగా పెరిగే అవకాశం ఉంది. షేర్లు తది తర ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, మదుపులు బాగా లాభిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయ వృద్ధికి చేపట్టే ప్రయత్నాలన్నీ లాభాల పంట పండిస్తాయి. ఇక ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృథా ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి ఆదాయం 14, వ్యయం 2 అయినందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా విజయవంతం అవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల విపరీతంగా లాభాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. వీరు ఆర్థిక లావాదేవీల్లో బాగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు.
- కర్కాటకం: ఈ రాశివారికి ఆదాయం 8, వ్యయం 2 అయినందువల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అద నపు ఆదాయ ప్రయత్నాలు కూడా చాలావరకు ఫలిస్తాయి. అదనపు ఆదాయాన్ని షేర్లు, స్పెక్యులేషన్లు తదితర ఆర్థిక లావాదేవీల్లో మదుపు చేసుకోవడం మంచిది. ఆస్తులు, ఇల్లు కొను గోలు ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఆస్తి లాభం కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. అయితే, నష్టదాయక వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.
- కన్య: ఈ రాశివారికి ఆదాయం 14, వ్యయం 2గా ఉన్నందువల్ల విశ్వావసు నామ సంవత్సరమంతా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అనేక ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. అయితే, కుటుంబ ఖర్చులు, ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు, ప్రయాణ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశివారికి ఆదాయం 11, వ్యయం 5 అయినందువల్ల ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండకపో వచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. షేర్ల వల్ల బాగా లాభపడతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తులు చేతికి అందుతాయి. అయితే, భాగస్వాములు, నమ్మినవారు, కొందరు బంధుమిత్రులు ఆర్థికంగా నష్టపరిచే అవకాశం ఉంది.