
ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన ఈ మహా కుంభమేళా జనవరి 13న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున ఉత్తరప్రదేశ్ కు తరలివస్తున్నారు. నిత్యం కోట్లాది మంది పాల్గొంటున్న ఈ కుంభమేళాకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా మహా కుంభమేళాలో దండలు అమ్ముకుంటున్న ఓ అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసిందే. కాటుక పెట్టిన తేనె కళ్లు.. డస్కీ స్కీన్ తో అందరి చూపును ఆకర్షించింది. సహజ సౌందర్యంతో లక్షలాది మందిని ఫిదా చేస్తున్న ఆ అమ్మాయి పేరు మోనాలీసా. ఇంకేముందు చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
కానీ ఆమె అందమే ఆమెకు ఇబ్బందిగా మారింది. మహా కుంభమేళాలో దండలు అమ్మి తన తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని వచ్చిన ఆ యువతిని నిత్యం ఫోటోస్, వీడియోస్ అంటూ తెగ ఇబ్బందిపెడుతున్నారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని ఆ యువతి చిరునవ్వుతోనే ఎదుర్కొంది. కానీ సోషల్ మీడియా ప్రచారం తన వృత్తికి ఇబ్బందిగా మారింది. దండలు అమ్మడానికి వీలులేకుండా పదుల సంఖ్యలో జనాలు ఆమె చుట్టూ చేరి వీడియోస్, ఫోటోస్ తీస్తూ ఆమెను ఇబ్బందిపెట్టారు. దీంతో ఆ యువతి ముఖం కనిపించకుండా మాస్క్, క్యాప్ జాకెట్ వేసుకుని దండలు అమ్మడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమె ఫోటోస్ తీయడానికి జనాలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు మోనాలిసాను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని తమ ఇంటికి పంపించారు.
మోనాలిసాను దండలు అమ్మకుండా ఇంటికి పంపడంతో తమకు ఆర్థికంగా నష్టమే ఉంటుందని.. అయినా చాలా మంది తమను ఇబ్బందిపెడుతున్నారని మోనాలిసా కుటుంబసభ్యులు వాపోతున్నారు. అయితే కుంభమేళాలో మోనాలిసా కోసం యూట్యూబర్లు ఇంటర్వ్యూలు అంటూ ఆమెను వెతుకుతూనే ఉన్నారు. దీంతో మోనాలిసాను తన తండ్రి ఇంటికి పంపించినట్లు సమాచారం.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..