
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులో ఫాస్ట్ బౌలర్, హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు చోటు దక్కలేదు. దీంతో ఇంటికే పరిమితమయ్యాడీ స్టార్ క్రికెటర్. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా సిరాజ్ పెళ్లి గురించి నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలీవుడ్ సింగర్ తో అతను డేటింగ్ చేస్తున్నాడంటూ పలు వెబ్ సైట్లలో కథనాలు కూడా వచ్చాయి. మరింత స్పీడ్‌గా ఈ పుకార్లు వ్యాపిస్తుండడంతో స్వయంగా సిరాజ్ నే స్పందించాడు. తనపై వస్తోన్న రూమర్లలో ఎలాంటి నిజం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. లెజండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు.. బాలీవుడ్ ప్రముఖ సింగర్ జనై భోస్లే తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంది. ముంబైలోని తన నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో మహ్మద్ సిరాజ్ కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో సిరాజ్, జనై కాస్త కాస్త సన్నిహితంగా ఉన్నట్లు కనిపించడంతో పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. చాలా కాలంగా వారు డేటింగ్లో ఉన్నారని నెట్టింట పుకార్లు వ్యాపించాయి. పెళ్లి కూడా చేసుకోనున్నారంటూ వెబ్సైట్లు కథనాలు ప్రచురించాయి. దీంతో సిరాజ్ రియాక్ట్ అయ్యాడు.
జనై భోస్లే తో తన రిలేషన్ షిప్ పై ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు సిరాజ్. జనై తనకు చెల్లెలు లాంటిదని, దయచేసి ఎవరూ తప్పుడు ప్రచారాలు చేయకండి అని రిక్వెస్ట్ చేశాడు. ఈ క్రమంలో సిరాజ్ ఒక ఫొటోను కూడా పంచుకున్నాడు. ‘జనై లాంటి చెల్లెలు నాకు ఎవరూ లేరు. ఆమె లేకుండా నా జీవితం ఉండదు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాల మధ్య చంద్రుడు ఒక్కడే ఉన్నట్లుగా వెయ్యి మందిలో ఆమె ఒకరు’ అని సిరాజ్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ పోస్టుకు జనై కూడా రియాక్ట్ అయింది. సిరాజ్ తనకు చాలా ఇష్టమైన సోదరుడు అంటూ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
ఆశా భోస్టే మనవరాలితో మహ్మద్ సిరాజ్..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..