
తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (MJTBC).. 2025-26 విద్యా సంత్సరానికి సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఆన్లైన్ దరకాస్తులు ప్రారంభమైనాయి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు మే 5, 2025వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అర్హతలు ఇవే..
ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో తొలి అటెంప్ట్‌లోనే 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంగ్లిష్ సబ్జెక్టులో 40 శాతం మార్కులతో తప్పనిసరిగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్ధులకు ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1,50,000, పట్టణాల్లో రూ.2,00,000కు మించకుండా ఉండాలి.
మెరిట్ ఆధారంగా బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీఏ, బీఎఫ్టీ, బీహెచ్ఎంసీటీ కోర్సుల్లో ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. పురుష, మహిళా అభ్యర్ధులకు విడివిడిగా మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనతోపాటు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా మే 5, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో దోస్త్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.200 చెల్లించవల్సి ఉంటుంది. అలాగే దోస్త్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.225, మెయింటెనెన్స్ ఛార్జెస్ రూ.1000, కాషన్ డిపాజిట్ రూ.1000 చెల్లించవల్సి ఉంటుంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్ధులను ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
దరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి.mjptbcwreis.telangana.gov.in or tgrdccet.cgg.gov.in/TGRDCWEB/
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.