

ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన 41వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మాంచి ఇన్నింగ్స్ ఆడాడు. అతను వరుసగా రెండవ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. అంతకుముందు ఏప్రిల్ 20న, చెన్నై సూపర్ కింగ్స్‌పై 76 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఇక ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లలో ఫెయిల్ అవుతూ వచ్చిన రోహిత్.. సరిగ్గా పీక్ అయ్యే టైంలో రెచ్చిపోయి మరీ అడుతుండటంతో ప్రత్యర్ధుల్లో వణుకు పుట్టకతప్పదు.
2016 తర్వాత ఐపీఎల్లో వరుసగా అర్ధ సెంచరీలు..
ఈ సీజన్లో రోహిత్ శర్మ వరుసగా రెండో మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించాడు. అంతకుముందు, అతను చెన్నై సూపర్ కింగ్స్‌పై 76 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 2016లో కూడా ఇలాంటి తరహ ఘనత సాధించాడు. ఆ సమయంలో అతడు వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్లో అతని ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే, 8 మ్యాచ్‌లలో 35.33 సగటుతో 212 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి..
రోహిత్ శర్మ టీ20ల్లో 12,000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించడంలో తక్కువ బంతులు ఎదుర్కుని విరాట్ కోహ్లీని వెనక్కినెట్టాడు. విరాట్ కోహ్లీ 8997 బంతులు ఆడి 12000 పరుగులు పూర్తి చేశాడు. రోహిత్ శర్మ 8885 బంతులు ఆడి ఈ ఘనత సాధించాడు. అతి తక్కువ బంతుల్లో 12000 పరుగులు పూర్తి చేసిన రికార్డు కీరన్ పొలార్డ్ పేరిట ఉంది. అతను కేవలం 7992 బంతులు ఆడి 12000 పరుగులు పూర్తి చేశాడు. దీని తర్వాత క్రిస్ గేల్ 8100 బంతులు ఆడి 12000 పరుగులు చేశాడు. హేల్స్ 8191 బంతులు ఆడి ఈ ఘనత సాధించాడు. జోస్ బట్లర్ 8261 బంతులు ఆడి 12000 పరుగులు పూర్తి చేశాడు. డేవిడ్ వార్నర్ 8563 బంతులు ఆడి 12000 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ తర్వాత షోయబ్ మాలిక్ ఈ కోవలోకి వస్తాడు. అతను 9424 బంతులు ఆడి 12000 పరుగులు పూర్తి చేశాడు.
ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సిక్సర్లు..
ఈ సీజన్లో సిక్సర్ల పరంగా రోహిత్ శర్మ కీరన్ పొలార్డ్‌ను వెనక్కి నెట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అతను 3 సిక్సర్లు బాదాడు. దీంతో అతను ముంబై ఇండియన్స్ తరపున అత్యధికంగా 259 సిక్సర్లు కొట్టి కీరాన్ పొలార్డ్(258 సిక్సర్లు) రికార్డును బ్రేక్ చేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్ 127 సిక్సర్లు, హార్దిక్ పాండ్యా 115 సిక్సర్లు, ఇషాన్ కిషన్ 106 సిక్సర్లతో ఈ లిస్టులో ఉన్నారు.