
Mumbai Indians vs Royal Challengers Bengaluru, 20th Match: సోమవారం ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి.
ముంబై జట్టు తమ తొలి నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కేవలం 12 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని చవిచూసింది. సోమవారం జరిగే మ్యాచ్‌లోనైనా గెలిచి, హార్దిక్ పాండ్యా సేన తమ ప్రచారాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాలని కోరుకుంటుంది. చివరి మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ గాయంతో ఆడలేదు. ఆదివారం నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే, రోహిత్ ఫిట్నెస్గా ఉన్నాడా లేడా అనేది మ్యాచ్‌కు ముందు తేలనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో బుమ్రా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అది కూడా టాస్ పడగానే తెలియనుంది.
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉందనిపిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుస విజయాలతో తమ ప్రచారాన్ని ప్రారంభించిన ఆర్సీబీ.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని జట్టు ఐకానిక్ వాంఖడే స్టేడియంలో విజయాల బాట పట్టాలని చూస్తోంది.
వాంఖడే స్టేడియం పిచ్ రిపోర్ట్..
ముంబైలోని వాంఖడే స్టేడియం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే, కొత్త బంతి స్వింగ్ అవుతుంది. ఓపెనింగ్ బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. బ్యాటర్లు క్రీజులో స్థిరపడగలిగితే, గేర్లు మార్చడం అంత కష్టం కాదు. ముఖ్యంగా ఫాస్ట్ అవుట్‌ఫీల్డ్‌తో బౌండరీల వర్షం కురుస్తుంది. IPLలో వాంఖడే స్టేడియంలో సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 119 పరుగులుగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ సగలు స్కోరు 171గా ఉంది. అయితే, ఛేజింగ్ జట్లు 65 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 53 సందర్భాలలో విజయం సాధించాయి.
హెడ్-టు-హెడ్ రికార్డ్‌లు..
ఆడిన మ్యాచ్‌లు | 33 |
ముంబై ఇండియన్స్ గెలిచింది | 19 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది | 14 |
టైడ్ | 0 |
ఫలితం తేలనివి | 0 |
MI vs RCB ప్రాబబుల్ ప్లేయింగ్ XIలు..
ముంబై ఇండియన్స్: విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, రాజ్ బావా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్.
ఇంపాక్ట్ ప్లేయర్: తిలక్ వర్మ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (కీపర్), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.
ఇంపాక్ట్ ప్లేయర్: రసిఖ్ సలాం.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..