
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్టోన్న సినిమా విశ్వంభర. డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. బింబిసార సూపర్ హిట్ తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. అయితే ఈసారి కాస్త భిన్నంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో చిరంజీవి కామిక్ పాత్రలో ప్రేక్షకులను నవ్వించనున్నట్లు తెలుస్తోంది. కామెడీతోపాటు యాక్షన్ సైతం ఉంటుందని.. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉండనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్రకు ధీటుగా విలన్ పాత్ర ఉండబోతుందని.. ఇందులో యంగ్ హీరో కార్తికేయ గుమ్మడి కొండ నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. చిరును ఢీకొట్టే పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడని ఫిల్మ్ వర్గాల్లో టాక్. కేవలం యాక్షన్ కాదు.. విలన్ పాత్ర సైతం కామిక్ గానే ఉంటుందట. అయితే దీనిపై ఇంకా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి కార్తీకేయ చిరంజీవికి వీరాభిమాని. కార్తికేయ పెళ్లిలో సైతం చిరు సందడి చేసిన సంగతి తెలిసిందే.
ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు కార్తీకేయ. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కార్తీకేయ.. ఆ తర్వాత పలు చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఆర్ఎక్స్ 100 సినిమా రేంజ్ హిట్ మాత్రం అందుకోలేదు. ఇదివరకే నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తీకేయ విలన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే అజిత్ నటించిన తెగింపు సినిమాలో కార్తీకేయ విలన్ పాత్ర పోషించారు. ఇప్పుడు చిరు మూవీలోనూ కార్తికేయ విలన్ పాత్రలో రఫ్పాడించనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..